ఆర్టీసీ బస్సులో ఫ్రీ టికెట్ పంచ్ చేసిన విజయ్: ఇకపై డీలక్స్ బస్సుల్లో కూడా ఉచితమే

తమిళనాడు ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని మరింత విస్తరించింది. గాంధీ జయంతిని పురస్కరించుకుని నేడు చెన్నై కోయంబేడు బస్టాండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి విజయ్.. వెట్రి పయణం పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఈ సౌకర్యాన్ని మరింత విస్తరించారు.

ఈ నూతన విధానం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు మరిన్ని రకాల బస్సులలో ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. గతంలో ఉన్న పరిమితులను సవరిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.గతంలో డీఎంకే హయాంలో సిటీ ఆర్డినరీ బస్సులకే ఈ పథకం పరిమితమై ఉండేది. ఫలితంగా గ్రామీణ, పట్టణ మహిళలు పూర్తిస్థాయిలో దీని ప్రయోజనాలను పొందలేకపోయారు.

CM Vijay provides tickets to women after launch expanded Vettri Payanam free bus scheme Tamil Nadu

పట్టణ ప్రాంతాల్లో సాధారణ బస్సుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఇబ్బందులు తలెత్తాయి. ఆ లోటుపాట్లను అధిగమిస్తూ విజయ్.. ఈ పథకాన్ని మరింత విస్తరింపజేశారు. మెట్రోపాలిటన్ తో పాటు పట్టణ ప్రాంతాల్లో తిరిగే ఎక్స్‌ప్రెస్, లిమిటెడ్ స్టాప్ సర్వీస్, డీలక్స్ బస్సుల్లోనూ మహిళలు ఇకపై ఉచితంగా ప్రయాణించవచ్చు.

భారీగా పుంజుకొంటోన్న బంగారం రేట్లు: ఇకపై ఇదే ట్రెండ్..?
భారీగా పుంజుకొంటోన్న బంగారం రేట్లు: ఇకపై ఇదే ట్రెండ్..?

వీటితో పాటు జిల్లాలను అనుసంధానించే ఆర్డినరీ మొఫిసిల్ బస్సులను కూడా దీని పరిధిలోకి తీసుకువచ్చారు. మహిళలతో పాటు ట్రాన్స్‌జెండర్లకు కూడా ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం వర్తిస్తుంది. తమిళనాడులోని ఏడు ప్రభుత్వ రవాణా సంస్థల పరిధిలో నడుస్తున్న మొత్తం 18,413 బస్సుల్లో దాదాపు 69 శాతం.. అంటే సుమారు 12,692 బస్సులు ఇప్పుడు ఈ వెట్రి పయణం పథకం పరిధిలోకి వచ్చాయి. ఈ మార్పుల వల్ల రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ దాదాపు 84.32 లక్షల మంది మహిళలకు ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.

ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ హైర్ బస్సులు: కిలో మీటర్ చొప్పున టారిఫ్ వెల్లడి
ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ హైర్ బస్సులు: కిలో మీటర్ చొప్పున టారిఫ్ వెల్లడి

ప్రతిరోజూ సుమారు 1.65 లక్షల సింగిల్ ట్రిప్పులలో మహిళలు ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటారని భావిస్తోంది. ఈ ఫ్రీ టికెట్ కోసం ఆర్టీసీ బస్సుల్లో ఎలక్ట్రానిక్ టికెటింగ్ మిషన్లల్లో నూతన సాఫ్ట్ వేర్ ను అమర్చారు. ఈ నూతన ఉచిత ప్రయాణ వ్యవస్థతో అనుసంధానించారు. ఈ పథకం అమలు వల్ల ఖజానా నుండి ప్రతి సంవత్సరం దాదాపు 6,000 కోట్ల రూపాయల వరకు అదనపు భారం పడుతుంది.

కోయంబత్తూరు-ఈరోడ్, ఈరోడ్-సేలం, తిరుచిరాపల్లి-దిండిగల్, తంజావూరు-నాగపట్టణం, మధరై-విరుదునగర్, తిరునెల్వేలి-నాగర్‌కోయిల్ లాంటి ప్రధాన రద్దీ అంతర్ జిల్లా మార్గాల్లో ప్రయాణించే మహిళలకు ఈ నూతన సదుపాయం ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. ఉన్నత విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థినులు, రోజువారీ ఉద్యోగాలకు వెళ్లే మహిళలు, చిన్న వ్యాపారాలు చేసుకునే పేద మహిళలకు ఎంతో లబ్ధి చేకూరుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+