రైతులు, ఉపాధ్యాయుల కోసం సీఎం విజయ్ చారిత్రాత్మక నిర్ణయం - బిగ్ రిలీఫ్..!!

తమిళనాడు సీఎం విజయ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి న తరువాత ఒక్కో వర్గానికి సంబంధించి వరుస నిర్ణయాలు తీసుకుంటున్న విజయ్.. ఇప్పుడు మరో నిర్ణయం అమలు చేసారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు అధికారికంగా నిర్ణయం అమలు చేస్తున్నారు. విజయ్ తాజా నిర్ణయం తో పెద్ద సంఖ్యలో రైతులు.. ఉపాధ్యాయులకు భారీ రిలీఫ్ దక్కనుంది. ఇప్పుడు విజయ్ నిర్ణయం రాజకీయంగానూ ఆసక్తిగా మారుతోంది.

సీఎం విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ప్రభుత్వ హయాంలో రైతులు.. ఉపాధ్యాయుల పైన నమోదైన కేసులను ఉప సంహరిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. డీఎంకే హయాంలో నిరసనలు చేపట్టిన రైతులు, ఉపాధ్యాయులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించిన విజయ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసారు. SIPCOT, పరందూర్ విమానాశ్రయం వంటి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా, అలాగే తమ డిమాండ్ల కోసం ఆందోళన చేసిన వారిపై నమోదైన 600 కేసులు ఎత్తివేయడంతో.. దాదాపు లక్ష మందికి భారీ ఊరట లభించనుంది. ప్రజాస్వామ్యబద్ధంగా హక్కులను వినియోగించుకున్న వారిపై కేసులు ఉండకూడదని సీఎం విజయ్ తేల్చి చెప్పారు. మే 2021 నుంచి 2026 మధ్య వివిధ నిరసనల్లో పాల్గొన్న రైతులు, టీచర్లపై అనేక కేసులు నమోదయ్యాయి. ఆ కేసులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉండటంతో బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

డీలిమిటేషన్ బిల్లుకు ఆ పార్టీల మద్దతు, కాంగ్రెస్ కు షాక్- లెక్క పక్కా.. ముహూర్తం ఫిక్స్..!!
డీలిమిటేషన్ బిల్లుకు ఆ పార్టీల మద్దతు, కాంగ్రెస్ కు షాక్- లెక్క పక్కా.. ముహూర్తం ఫిక్స్..!!
cm-vijay-takes-key-decision-to-withdraw-cases-against-farmers-and-teachers-details-here

రైతులు, ఉపాధ్యాయులకు బిగ్ రిలీఫ్

కాగా, రైతులు... ఉపాధ్యాయులకు తమ ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుందని విజయ్ స్పష్టం చేసారు. SIPCOT పారిశ్రామిక అభివృద్ధి ప్రాజెక్టులు, ప్రతిపాదిత పరందూర్ విమానాశ్రయం వంటి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న రైతులపై కేసులు నమోదయ్యాయ ని వివరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా తమ సమస్యలను వ్యక్తం చేసిన వారిపై కేసులు కొనసాగడం సరికాదని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా తమ డిమాండ్ల కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన లు చేసిన ఉపాధ్యాయులపై కూడా కేసులు నమోదయ్యాయని విజయ్ తెలిపారు. వారిపై పెండింగ్‌ లో ఉన్న కేసులను కూడా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఇటీవల తమిళనాడు ప్రభుత్వం యాంటీ-NEET ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహ రించుకునేందుకు కూడా నిర్ణయించింది. దీంతో, విజయ్ నిర్ణయం అమలు దిశగా ఉత్తర్వుల జారీ పైన రాజకీయంగానూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+