స్టాలిన్ ప్రభుత్వ కూల్చివేత హెచ్చరికల వేళ గేమ్ మార్చిన విజయ్ - ఊహించని రాజకీయం..!!
తమిళనాట రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. ఎన్నికల్లో అనూహ్య విజయ్ సాధించి డీఎంకే మిత్రపక్షాల సాయంతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసారు. బల పరీక్షలో నెగ్గారు. ఇక ఇబ్బంది లేదని భావిస్తున్న సమయంలో ఆకస్మికంగా మాజీ సీఎం స్టాలిన్ అప్పుడే విజయ్ ప్రభుత్వం కూలి పోవటం గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ సమయంలోనే విజయ్ అలర్ట్ అయ్యారు. అటు అన్నాడీఎంకే చీలిక వర్గం మద్దతు ఉన్నా.. సాంకేతిక కారణాల వలన కొత్త వ్యూహం అమలుకు సిద్దమయ్యారు. ఈ సమయంలో ఢిల్లీ పర్యటన రాజకీయంగా ఆసక్తి పెంచుతోంది.
తమిళనాడు సీఎం విజయ్ పాలనా పరంగా తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో రాజకీయంగానూ కొత్త వ్యూహాల అమలుకు సిద్దమయ్యారు. 108 స్థానాలతో గెలిచిన విజయ్ డీఎంకే మిత్రపక్షాల సాయంతో 120 సీట్ల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసారు. కాగా.. విజయ్ తో కలిసినందుకు కాంగ్రెస్ తో కటీఫ్ చెప్పిన డీఎంకే.. మిగిలిన మిత్రపక్షాలతో మాత్రం సయోధ్య కొనసాగిస్తోంది. కాగా, అసెంబ్లీ వేదికగా తమ మిత్రపక్షాలతోనే విజయ్ ప్రభుత్వ మనుగడ కొనసాగుతోందని ఉదయనిధి స్టాలిన్ చెప్పుకొచ్చారు.

ఇక.. తాజాగా మాజీ సీఎం స్టాలిన్ సైతం విజయ్ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని.. మధ్యంతర ఎన్నికలు తప్పవని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కొత్త చర్చకు కారణమయ్యాయి. అటు బల పరీక్ష సమయంలో అన్నా డీఎంకే నుంచి 25 మంది ఎమ్మెల్యేలు విజయ్ కు మద్దతుగా నిలిచారు. అయితే.. వారిలో అనర్హత వేటు భయం కనిపిస్తోంది. బీజేపీకి అన్నాడీఎంకే మిత్రపక్షంగా ఉంది. తాజాగా చోటు చేసుకున్న రాజకీయ సమీకరణాల వేళ బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
ఢిల్లీ కేంద్రంగా కీలక మంత్రాంగం
కాగా.. ఈ నెల 22న విజయ్ ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఇప్పుడు తమిళనాడు పరిణామాలను తమకు అనుకూలంగా మలచుకునేందుకు బీజేపీ సమాయత్తం అవుతోంది. విజయ్ ప్రభుత్వానికి సంఖ్యా పరంగా ఇబ్బంది లేకుండా అన్నా డీఎంకే చీలక వర్గం పైన ఎలాంటి చర్యలకు ఒత్తిడి చేయకూడదనే వ్యూహాత్మక కార్యాచరణ మాజీ సీఎం పళినిస్వామికి నిర్దేశిస్తున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. స్టాలిన్ మిత్రపక్షాలు భవిష్యత్ లో విజయ్ కు దూరం అయినా.. ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా పరోక్ష సహకారం అందించే విధం గా ఢిల్లీలో మంత్రాంగం సాగుతున్నట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాలు కాంగ్రెస్ కు మింగుడు పడటం లేదు. విజయ్ కోసం తమిళనాడులో బలమైన డీఎంకే కు కాంగ్రెస్ దూరమైంది. ఇప్పుడు బీజేపీ మిత్రపక్షంతో విజయ్ ప్రభుత్వ భవిష్యత్ ముడి పడి ఉండటం..కాంగ్రెస్ నాయకత్వానికి అంతు చిక్కని అంశంగా మారుతోంది. అన్నా డీఎంకే చీలక వర్గం విజయ్ కు మద్దతు ఇవ్వటం పైన అభ్యంతరం లేకపోయినా.. తెర వెనుక బీజేపీ పాత్ర కాంగ్రెస్ కు ఇబ్బందిగా మారుతోంది. దీంతో.. విజయ్ ఢిల్లీ యాత్ర అధికారికంగా- రాజకీయంగా కీలకంగా మారుతోంది.













Click it and Unblock the Notifications