పొలంలోకి దిగి ట్రాక్టర్ తోలిన విజయ్.. ప్రతిపక్షాల ట్రోలింగ్
తమిళనాడు ఉపఎన్నికల ప్రచార పర్వం తీవ్ర స్థాయికి చేరింది. తమిళగ వెట్రి కళగం వ్యవస్థాపకుడు, సీఎం సి. జోసెఫ్ విజయ్ మధురాంతకం అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్‌షో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. అక్టోబర్ 6న జరగనున్న ఉపఎన్నికల్లో టీవీకే అభ్యర్థి మరకతం కుమారవేల్ గెలుపే లక్ష్యంగా విజయ్ విస్తృతంగా పర్యటించారు. ఈ ప్రచారంలో భాగంగా చెన్నైకి చేరువలోని మధురాంతకం ప్రాంతంలో 30కి పైగా గ్రామాల గుండా వెళ్తూ ప్రజలను పలకరించారు. పర్యటన మధ్యలో ఒక టీకొట్టు వద్ద ఆగి, స్థానికులతో కలిసి టీ తాగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
పొలంలోకి దిగి ట్రాక్టర్ నడిపిన విజయ్
రోడ్‌షో సాగుతుండగా రోడ్డు పక్కన ఉన్న పొలాల్లో ఓ రైతు ట్రాక్టర్ నడుపుతుండటం చూసి సీఎం విజయ్ తన కాన్వాయ్‌ని ఆపారు. నేరుగా పొలంలోకి దిగి ఆ రైతు వద్దకు వెళ్లారు. ఊహించని ఈ పరిణామంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆశ్చర్యానికి లోనయ్యారు. అనంతరం విజయ్ స్వయంగా ట్రాక్టర్ డ్రైవింగ్ సీటెక్కి, పొలంలో కొన్ని నిమిషాల పాటు ఉత్సాహంగా ట్రాక్టర్ నడిపారు. అక్కడి నుంచి ప్రధాన రహదారిపైకి ట్రాక్టర్ తీసుకొచ్చి పక్కనే వేచి ఉన్న ప్రజలకు అభివాదం చేశారు.

నెట్టింట ఏఐఏడీఎంకే సెటైర్లు.. 'పాండియమ్మ' వీడియో వైరల్
విజయ్ పొలంలో ట్రాక్టర్ నడిపిన వీడియో సోషల్ మీడియాలో నిమిషాల్లో వైరల్‌గా మారింది. అయితే, ఈ వీడియోపై ప్రత్యర్థి పార్టీ ఏఐఏడీఎంకే (AIADMK) ఐటీ వింగ్ తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. విజయ్ ట్రాక్టర్ నడపడంలో తడబడ్డారంటూ వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది. "ఓహో.. ట్రాక్టర్ నడిపే సీన్ తీస్తున్నారా భాయ్.. ముందే రిహార్సల్ సరిగ్గా చేసుకోలేదా? అందుకే ఇంతగా తడబడుతున్నారు.. ఉపఎన్నికల భయం మనిషితో ఏమైనా చేయిస్తుంది" అంటూ ఎద్దేవా చేసింది.
ஓஹ்ஹ்… டிராக்டர் ஓட்டுற Scene-ஆ ப்ரோ @actorvijay?
— AIADMK IT WING (@AIADMKITWINGOFL) October 2, 2026
Rehearsal ஒழுங்கா பண்ணலையோ… இவ்ளோ தடுமாறுது..!!
இடைத்தேர்தல் தோல்வி பயம் படுத்தும் பாடு! #ஆச்சரியக்குறி_பரிதாபங்கள் pic.twitter.com/4Y3K2gPqSe
సరికొత్త మీమ్‌తో సోషల్ మీడియాలో రచ్చ
కొద్దినెలల క్రితం సోషల్ మీడియాను ఊపేసిన ఓ పాపులర్ 'డ్రైవింగ్ స్కూల్' ఆడియోను ఈ వీడియోకు జోడించి ఏఐఏడీఎంకే ప్రచారం మొదలుపెట్టింది. టూవీలర్ సరిగ్గా నడపలేని 'పాండియమ్మ' అనే మహిళను ట్రైనర్ పొగుడుతుండగానే ఆమె కిందపడిపోయే హాస్యపూరిత ఆడియోను విజయ్ ట్రాక్టర్ వీడియోకు బ్యాక్‌గ్రౌండ్‌గా ఉంచి పోస్ట్ చేశారు. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ప్రచార శైలి ఎంతటి ఆసక్తిని రేకెత్తిస్తోందో, ఏఐఏడీఎంకే వేసిన ఈ కౌంటర్ సైతం అంతే స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.














Click it and Unblock the Notifications
