ఫ్యాన్ నుంచి వైఫ్ గా మారి.. సీఎం విజయ్ లవ్ స్టోరీ తెలిస్తే షాక్ అవుతారు..!
సీఎం విజయ్ కు బిగ్ రిలీఫ్ లభించినట్లు స్పష్టం అవుతోంది. ఆయన సతీమణి సంగీత తన విడాకుల పిటిషన్ ను ఉపసంహరించుకుంది. దాంతో సుదీర్ఘ కాలంపాటు జరిగిన వీరి విడాకుల వ్యవహారం ఎట్టకేలకు ముగిసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు చెంగల్పట్టులోని కుటుంబ సంక్షేమ కోర్టులో నడుస్తున్న ఈ విడాకుల కేసును న్యాయమూర్తి పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అటు దీనిపై విజయ్ తరఫు న్యాయవాదులు కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దాంతో న్యాయస్థానం ఈ కేసును అధికారికంగా క్లోజ్ చేసింది.
ఇక విజయ్- సంగీత ల విడాకుల వ్యవహారం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచీ రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత విజయ్ తమిళనాడు సీఎం అయ్యారు. సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన భార్యా పిల్లలు ఎవరూ హాజరు కాలేదు. అంతేకాక ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సినీ నటి త్రిష హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ క్రమంలో ఇక విజయ్- సంగీత విడాకులు కన్ఫామ్ అనుకున్నారు అంతా. కానీ సడెన్ గా సంగీత తన పిటిషన్ ను వెనక్కు తీసుకున్నారు. దీనిపై ఇంకా అధికారికంగా స్పష్టత రాలేదు. మరి ఈ అంశంపై ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదిరిందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఈ అంశం నేపథ్యంలో విజయ్- సంగీత లవ్ స్టోరీ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే సంగీతతో విజయ్ ది ప్రేమ వివాహమే అని తెలుస్తోంది. యూకే బిజినెస్ మెన్ కుమార్తె అయిన సంగీత దళపతికి పెద్ద ఫ్యాన్ అని సమాచారం. విజయ్ నటించిన పూవే ఉనక్కగా మూవీ విజయం నేపథ్యంలో విజయ్ ను కలిసేందుకు సంగీత యూకే నుంచి చెన్నై వచ్చారు. అయితే ఆమె సింప్లిసిటీకు ఫిదా అయిన విజయ్.. సంగీతను ఇంట్లో వాళ్లకు పరిచయం చేశారు. అలా ఇరు కుటుంబాల మధ్య అంగీకారంతో 1998 లో విజయ్- సంగీత వివాహం జరిగింది. వీరికి జాసన్ సంజయ్, దివ్య అనే ఇద్దరు పిల్లలున్నారు. జాసన్ సంజయ్ ప్రస్తుతం దర్శకుడిగా పని చేస్తున్నారు. దివ్య యూకేలో విద్యనభ్యసిస్తోంది.


Click it and Unblock the Notifications