ఇకపై స్కూళ్లలో అవి బ్యాన్: సీఎం విజయ్ కీలక ఆదేశాలు
తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల్లో రాజకీయ కార్యకలాపాలను నిషేధించింది. రాజకీయ నేతలు, కార్యకర్తలు పాఠాశాలల్లోకి ప్రవేశించరాదని తెలిపింది. విద్యాసంస్థలు కేవలం నేర్చుకోవడానికి మాత్రమే ఉన్నాయని రాజకీయ కార్యకలాపాలకు కాదని పేర్కొంది. ఈ మేరకు స్కూల్ ఎడ్యూకేషన్ మినిస్టర్ రాజ్ మోహన్ సర్క్యూలర్ జారీ చేసింది. ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రతినిధులు అధికారిక ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అనుమతి ఉందని.. వాళ్లు మాత్రమే పాఠశాలలు, తరగతి గదుల్లోకి వచ్చేందుకు అనుమతి ఉందని అందులో వివరించింది.
తరగతిగదులు కేవలం విద్యను అందించేందుకు మాత్రమే ఉన్నాయని ఇతర కార్యకలాపాలకు అవి లేవని తెలిపింది. రాజకీయ నేతలు లేదా వ్యక్తులను పొగిడేందుకు పాఠశాలలను వేదికగా మార్చుకోవద్దని అందులో స్పష్టం చేసింది. అలాగే క్లాస్ రూమ్స్, స్కూల్ ఆవరణలో రాజకీయ నేతల బర్త్ డేలు, ఇతర కార్యక్రమాలు కూడా చేసుకోవద్దని సూచనలు చేసింది. విద్యాసంస్థల్ని రాజకీయ ప్రయోజనాలకు దూరంగా ఉంచాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీవీకే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించే ఏ కార్యక్రమం అయినా విద్యాపరంగా మాత్రమే ఉండాలని తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను విడుదల చేస్తామని పేర్కొంది. ఇక ప్రస్తుతం తమిళనాడులో 57,566 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో మొత్తం 1.24 కోట్ల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 5.69 లక్షల మంది టీచర్లు ఉన్నారు. రాష్ట్రంలో టీచర్- స్టూడెంట్ నిష్పత్తి 22గా ఉంది. అంటే ప్రతి 22 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు. సరాసరిగా ఒక్కో స్కూల్ లో 215 మంది విద్యార్థులు, 10 మంది ఉపాధ్యాయులు ఉన్నారు.

మరోవైపు తాజాగా సీఎం విజయ్ కరూర్ లో పర్యటించిన విషయం తెలిసిందే. కరూర్ లో నిర్వహించిన బహిరంగ సభను కరూర్ లోని పంచాయత్ యూనియన్ మిడిల్ స్కూల్ లో అక్కడి ప్రిన్సిపల్ లైవ్ స్ట్రీమింగ్ వేశారు. విద్యార్థులను అందరినీ ఒక చోట కూర్చొబెట్టి విజయ్ స్పీచ్ ను చూపించారు. ఈ విషయం తమిళనాడు ప్రభుత్వం దృష్టికి చేరడంతో ఆ పాఠశాల ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు చేసి చేసింది. అయితే ఇదే విషయంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాజ్ మోహన్ మాట్లాడుతూ.. పాఠశాలలో సీఎం స్పీచ్ ను చూపించడం అక్కడి ప్రిన్సిపల్ వ్యక్తిగత నిర్ణయం అని.. ఇందులో ఎలాంటి రాజకీయ ప్రయోజనం లేదని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications