రూ. వేల కోట్ల బొగ్గు స్కాం కేసు: మాజీ సీఎం దోషి: సీబీఐ కోర్టు, రేపు శిక్ష ఖరారు!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రూ. వేల కోట్ల బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం తీర్పు వెల్లడించింది. బొగ్గు గనుల స్కాం కేసులో ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కొడా, ఆ రాష్ట్ర బొగ్గు గనుల శాఖ మాజీ కార్యదర్శి హెచ్ సీ. గుప్తాతో సహా మరో ఐదుగురిని దోషులుగా తేల్చింది.
బొగ్గు గనుల అక్రమ కేటాయింపు కేసులో మాజీ సీఎం మధు కొడా అవినీతికి పాల్పడినట్లు రుజువైందని సీబీఐ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో మరో నలుగురిని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నిర్దోషులుగా తేల్చింది. మాజీ సీఎం మధు కోడాతో సహ నిందితులకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం గురువారం వీరికి శిక్ష ఖరారు చేయనుంది.

2007లో ఝార్ఖండ్ లోని రాజ్ హరా పట్టణం సమీపంలో గల కోల్ కతాకు చెందిన విని ఐరన్ అండ్ ఫీల్డ్ ఉద్యోగ్ లిమిటెడ్ అనే కంపెనీకి అక్రమంగా బొగ్గు గనులు కేటాయించారని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మధు కోడా తదితరుల మీద ఆరోపణలు రావడంతో సీబీఐ కేసు నమోదు చేసింది.
బొగ్గు గనుల కేటాయింపులో అప్పటి ఝార్ఖండ్ ముఖ్యమంత్రి మధుకొడా, మరికొందరు ప్రభుత్వ ఉన్నతాధికారులు విని ఐరన్ కంపెనీకి అనుకూలంగా వ్యవహరించి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపిస్తూ సీబీఐ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది.
బొగ్గు గనుల కేటాయింపు విషయంలో పారదర్శకంగా వేలం నిర్వహించలేదని, దీనివల్ల ప్రభుత్వానికి రూ. కొన్ని వేల కోట్లు నష్టం వచ్చిందని, అక్రమాలు జరిగాయని సీబీఐ పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన సీబీఐ ప్రత్యేక కోర్టు మధుకొడా సహా మొత్తం ఏడుగురిని దోషులుగా తేలుస్తూ బుధవారం తీర్పు వెల్లడించింది. గురువారం ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడాతో సహ అధికారులకు ఎలాంటి శిక్ష పడుతుందో అంటూ దేశం మొత్తం ఎదురు చూస్తోంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications