Viral Video: ఆలయ గర్భగుడి తెరవగానే పూజారికి ఊహించని షాక్‌.. భయంతో పరుగులు తీసిన అర్చకుడు

ఒడిషాలోని ఓ ఆలయంలో సాయంత్రం పూజ కోసం మూసి ఉన్న గర్భగుడిని తెరిచిన పూజారికి ఊహించని షాక్ ఎదురైంది. గర్భగుడిలో 12 అడుగుల భారీ నాగుపాము ఒక్కసారిగా ప్రత్యక్షమై హల్చల్ చేసింది. దాంతో అర్చకుడు భయంతో పరుగులు తీశాడు. పాము గర్భగుడి నుంచి బయటకు రావడంతో అప్పటికే క్యూలైన్ లో నిల్చుని దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులు ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగులు తీశారు. 12 అడుగుల గిరి నాగు మనిషి ఎత్తు లేచి బుసలు కొడుతున్న క్రమంలో దాన్ని పట్టుకునేందుకు ఎవరూ సాహసం చేయలేదు. అయితే అక్కడి సిబ్బంది స్నేక్ సొసైటీ వాళ్లకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు హుటాహుటిన అక్కడకు చేరుకుని వంటశాలలోకి పోయి నక్కి ఉన్న గిరి నాగును అతి కష్టంమీద బంధించారు. ఆ తర్వాత అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఒడిషాలోని గంజాం జిల్లాలోని రత్నై ఆలయంలో సాయంత్రం పూజలకు ఏర్పాట్లు సాగుతున్న క్రమంలో గర్భగుడి తలుపులు తెరిచిన పూజారికి అక్కడ 12 అడుగుల భారీ నాగు పాము బుసలు కొట్టడం చూసి భయంతో వణికిపోయాడు. వెంటనే అప్రమత్తమైన ఆయన సంబంధిత అటవీ శాఖ అధికారులకు, స్థానిక స్నేక్ హెల్ప్‌ లైన్ బృందానికి సమాచారం అందించాడు. వెంటనే అక్కడకు చేరుకున్న ఆ సిబ్బంది ఆలయ పవిత్రతకు భంగం కలిగించకుండా, భక్తుల మనోభావాలను దెబ్బతీయకుండా తమ షూస్ కు గోనె సంచులను చుట్టుకుని మరీ ఈ ఆపరేషన్ చేపట్టి ఎట్టకేలకు గిరి నాగును బంధించారు. అయితే ఇంత పెద్ద పాము గర్భ గుడిలోకి ఎలా వచ్చిందో అర్ధం కావడం లేదని అక్కడి పూజారులు, సిబ్బంది తెలిపారు.

cobra Priest gets shock upon opening temple doors 12 foot cobra appears in the sanctum sanctorum

ఇక ఇంతటి ఉద్రిక్త వాతావరణంలోనూ ఆ నాగు పాము వంటశాలవైపు వెళ్లి ఎవరికీ హానీ చేయకుండా సమీపంలో డోలు వాయిద్యాల శబ్దం వినిపిస్తున్న సమయంలో.. అలాగే గంటపాటు నిలబడి శ్రద్ధగా విన్నట్లు అక్కడి వాళ్లు తెలిపారు. ఈ లోపు స్నేక్ సొసైటీ సిబ్బంది వచ్చి పామును బంధించినట్లు వివరించారు. ఆ తర్వాత ఈ విష సర్పాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించి అడవిలో విడిచిపెట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+