Air India: ఎంత పని చేశావ్ భయ్యా.. ?

బెంగళూరు నుంచి వారణాసికి వెళ్తున్న విమానంలో షాకింగ్ ఘటన జరిగింది. విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి బాత్ రూమ్ అర్జెంట్ కావడంతో టాయిలెట్ డోర్ అనుకుని కాక్‌పిట్‌ డోర్‌ తెరిచేందుకు యత్నించాడు. అయితే పాస్ వర్డ్ ఉన్న కారణంగా ఆ డోర్ ఓపెన్ కాలేదు. దీంతో అతడు చేసిన పనికి తోటి ప్రయాణికులు హడలెత్తిపోయారు. హైజాక్ అవుతుందనే భయంతో బెంబేలెత్తిపోయారు. అయితే అతడి కదలికల్ని గమనించిన విమానం క్రూ సిబ్బంది వెంటనే ఆ ప్రయాణికుడ్ని సీట్లో కూర్చోబెట్టారు. బెంగళూరు నుంచి వారణాసికి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఈ ఘటన జరిగింది. విమానం వారణాసిలో ల్యాండింగ్ అయ్యాక ఎయిర్ ఇండియా సిబ్బంది ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించింది. తాను విమానం ఎక్కడం ఇదే ఫస్ట్ టైమ్ అని ఆ వ్యక్తి వాదించినట్లు సమాచారం.

ఎయిర్ ఇండియా విమానంలో మరోసారి షాకింగ్ ఘటన జరిగింది. తొలిసారి విమానం ఎక్కిన ఓ వ్యక్తి టాయిలెట్ డోర్ అని కాక్ పిట్ డోర్ ను ఓపెన్ చేసేందుకు యత్నించాడు. ఆ వ్యక్తి మరో ఏడుగురితో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. అయితే పాస్ వర్డ్ కారణంగా కాక్ పిట్ డోర్ ఓపెన్ కాలేదు. ఈ క్రమంలో విమానంలోని తోటి ప్రయాణికులు భయబ్రాంతులకు లోనయ్యారు. విమానం హైజాక్ అవుతుందేమోనని భయపడ్డారు. అతడ్ని గమనించిన క్రూ సిబ్బంది.. ఆ వ్యక్తిని సీట్లో కూర్చోబెట్టారు. ఈ ఘటన బెంగళూరు నుంచి వారణాసికి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఇవాళ ఉదయం జరిగింది.

Cockpit Chaos Mid-Air First-Time Flyer Tries Busting Into Pilots Den on Air India Flight Passengers in Panic

అయితే విమానం వారణాసిలో సురక్షితంగా ల్యాండింగ్ అయ్యాక ఆ వ్యక్తితో పాటు అతడితో ప్రయాణించిన మరో ఏడుగురిని ఎయిర్ ఇండియా సిబ్బంది.. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కు అప్పగించింది. వీరిని అదుపులోకి తీసుకున్న సీఐఎస్ఎఫ్ ప్రస్తుతం విచారణ జరుపుతోంది. ఇక ఇదే విషయంపై ఎయిర్ ఇండియా మాట్లాడుతూ.. ప్రయాణికుల భద్రత విషయంలో తాము ఎలాంటి రాజీపడటం లేదని స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+