ఎన్నికలు దగ్గరికొచ్చిన వేళ.. యూపీలో కాక్రోచ్ జనతా పార్టీ బిగ్ స్టెప్: 10 రాష్ట్రాల్లో విస్తరణ

కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తన సంస్థాగత నిర్మాణాన్ని విస్తరించింది. దశలవారీగా దేశవ్యాప్తంగా విస్తరించబోతోంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా 10 రాష్ట్రాల్లో సమన్వయ కమిటీలను నియమించింది. వివిధ ప్రాంతాలకు సంబంధించిన జోనల్ స్థాయి కమిటీలనూ ఏర్పాటు చేసింది. వీటిల్లో ఉత్తర్ ప్రదేశ్ సైతం ఉండటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇంకో నాలుగైదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న రాష్ట్రం ఇది. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ లో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. దేశంలోనే అత్యధికంగా 403 అసెంబ్లీ స్థానాలు ఉన్న అతిపెద్ద రాష్ట్రం కావడం, బీజేపీకి గట్టి పట్టు ఉండటం వల్ల ఈ ఎన్నికలపై అందరి దృష్టీ నెలకొనడం సహజమే. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో వరుసగా రెండుసార్లు బీజేపీ ఇక్కడ అధికారంలోకి వచ్చింది. హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉంది. దీంతో రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది.

Cockroach Janta Party appointments zonal incharges and regional coordination committees in 10 states

ఈ సంస్థాగత విస్తరణలో భాగంగా పశ్చిమ జోన్ ఇన్‌ఛార్జ్ గా క్షితిజ్ పగార్ నియమితులయ్యారు. నార్త్ జోన్ బాధ్యతలను డాక్టర్ వివేక్ సాంగ్వాన్‌కు అప్పగించారు. అలాగే ఇదే జోన్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులుగా మహమ్మద్ జునైద్, గీగ్‌రాజ్ జోర్లీ అపాయింట్ అయ్యారు. జమ్మూకాశ్మీర్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, హర్యానా, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాలు, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్‌లలో ఈ కమిటీలు క్రియాశీలకంగా వ్యవహరించనున్నాయి.

బంగాళాఖాతంలో బలపడ్డ అల్పపీడనం: ఏపీలో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో బలపడ్డ అల్పపీడనం: ఏపీలో భారీ వర్షాలు

వివిధ రాష్ట్రాల కమిటీలలో సభ్యుల సంఖ్యను కూడా సీజేపీ ఖరారు చేసింది. అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్ సమన్వయ కమిటీలో 16 మంది సభ్యులను నియమించింది. ఇక్కడున్న 403 అసెంబ్లీ సీట్ల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువమంది సమన్వయ కమిటీ సభ్యులను తీసుకుంది. మహారాష్ట్ర- 15, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాలకు కలిపి- 14 మంది చొప్పున, బీహార్‌- 13, పశ్చిమ బెంగాల్‌-12 మందికి చోటు కల్పించారు.

గాజాపై ఇజ్రాయెల్ మెరుపుదాడులు- హమాస్ సీనియర్ కమాండర్ హతం
గాజాపై ఇజ్రాయెల్ మెరుపుదాడులు- హమాస్ సీనియర్ కమాండర్ హతం

హర్యానా, ఉత్తరాఖండ్‌లలో ఆరుమంది చొప్పున, రాజస్థాన్‌లో అయిదుమంది, జమ్మూకాశ్మీర్‌లో నలుగురు సభ్యులతో ఈ కమిటీలు రూపుదిద్దుకున్నాయి. నిరుద్యోగం, పరీక్షల లీకేజీలపై గళమెత్తిన ఈ పొలిటికల్ ప్లాట్ ఫామ్.. జంతర్ మంతర్ వద్ద నీట్ యూజీ పేపర్ లీకేజీపై 36 రోజుల పాటు సుదీర్ఘ నిరసన చేపట్టి వార్తల్లో నిలిచింది. దీని దెబ్బకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సొచ్చింది.

అనంతరం ఓటర్ల జాబితాపై ఉద్యమించింది కాక్రోచ్ జనతా పార్టీ. ప్రస్తుతం ఎస్ఐఆర్ వల్ల ఓటరు జాబితా నుంచి పేర్లు కోల్పోయిన వారి వివరాలు సేకరించడానికి ప్రత్యేక ఆన్‌లైన్ ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చింది. వార్తల్లోకి రాని సామాన్య ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని పేర్కొంది. తాము సేకరించిన డేటా ఆధారంగా ఓటర్ల హక్కుల పునరుద్ధరణ కోసం పోరాడతామని పార్టీ నాయకులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+