బొద్దింకలు, పరాన్నజీవులు..! నిరుద్యోగుల తీరుపై సీజేఐ ఫైర్..!

దేశంలో కొందరు నిరుద్యోగులు సోషల్ మీడియాగా, మీడియాగా, సమాచార హక్కు కార్యకర్తల రూపంలో బొద్దింకలు, పరాన్న జీవులాగ మారిపోయి వ్యవస్థలపై చేస్తున్న దాడులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (CJI) తీవ్రంగా మండిపడ్డారు. ఓ లాయర్ కు సీనియర్ అడ్వకేట్ హోదా కల్పించే అంశంపై దాఖలైన పిటిషన్ ను విచారిస్తున్న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ ధర్మాసనం.. అతని దుష్ప్రవర్తనపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.

సీనియర్ అడ్వకేట్ హోదా కోసం దూకుడుగా ప్రయత్నిస్తున్న పిటిషనర్ న్యాయవాదిని సుప్రీంకోర్టు మందలించింది. ఫేస్‌బుక్‌లో ఆయన వాడినట్లు ఆరోపణలు ఉన్న భాషతో సహా, ఆయన ప్రవర్తనను కూడా కోర్టు ప్రశ్నించింది. ప్రపంచమంతా సీనియర్ అడ్వకేట్ కావడానికి అర్హులు కావచ్చు, కానీ కనీసం మీకు మాత్రం ఆ అర్హత లేదని తేల్చిచెప్పేసింది. ఒకవేళ ఢిల్లీ హైకోర్టు పిటిషనర్‌కు సీనియర్ అడ్వకేట్ హోదాను మంజూరు చేస్తే, ఆయన వృత్తిపరమైన ప్రవర్తనను దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు దానిని రద్దు చేస్తుందని హెచ్చరించారు.

Cockroaches and Parasites CJI Delivers Scathing Attack on Youth Who Denounce the System They Depend On

సదరు న్యాయవాది సోషల్ మీడియా ప్రవర్తనను ప్రస్తావిస్తూ సీజేఐ సూర్యకాంత్.. వ్యవస్థపై దాడి చేసే పరాన్నజీవులు ఇప్పటికే సమాజంలో ఉన్నారు, మీరు వారితో చేతులు కలపాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. బొద్దింకల వంటి యువకులు ఉన్నారు, వారికి ఎలాంటి ఉపాధి లభించదు లేదా వృత్తిలో స్థానం ఉండదు. వారిలో కొందరు మీడియాగా, కొందరు సోషల్ మీడియా కార్యకర్తలుగా, ఆర్టీఐ కార్యకర్తలుగా, ఇతర కార్యకర్తలుగా మారి అందరిపై దాడి చేయడం ప్రారంభిస్తారన్నారు. సీనియర్ అడ్వకేట్ హోదా అనేది ఒక న్యాయవాదికి ఇచ్చే గుర్తింపు మాత్రమేనని, అది దూకుడుగా వెంబడించాల్సిన విషయం కాదని ధర్మాసనం పేర్కొంది. చివరికి పిటిషనర్ తన పిటిషన్ వెనక్కి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+