రాహుల్, అమిత్ షాలపై ఫిర్యాదులు: జవాబివ్వాలంటూ ఖర్గే, జేపీ నడ్డాకు ఈసీ

మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఇటీవల ఒకరిపై ఒకరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో స్పందించిన ఎన్నికల సంఘం.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖార్గేకు వేర్వేరుగా లేఖలు పంపింది.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ ఈసీకి బీజేపీ నేతలు ఇటీవల ఫిర్యాదు చేశారు. మరోవైపు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇరు పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన ఎన్నికల సంఘం స్పందించింది.

Code violation complaints EC letter to JP Nadda Mallikarjuna Kharge for reply

నవంబర్ 18వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట వరకు అధికారిక వివరణ ఇవ్వాలని ఇరు పార్టీల అధ్యక్షులు జేపీ నడ్డా, మల్లిఖార్జున ఖార్గేలకు ఎన్నికల సంఘం ఆదేశించింది. సంబంధిత ఫిర్యాదులను కూడా రెండు పార్టీలకు పంపింది. ఇటీవల లోక్‌సభ ఎన్నికల సందర్భంగా స్టార్ క్యాంపెయినర్లకు చేసిన సూచనలను ఈసీ ప్రస్తావించింది.

జాతీయ పార్టీల స్టార్ క్యాంపెయినర్లు ఇతరులకు ఆదర్శంగా నడుచుకోవాలని, సమాజంలో సున్నితమైన కూర్పును పాడుచేయొద్దని లోక్‌సభ ఎన్నికల సమయంలో ఈసీ సూచించింద. తమ మాటలు, ప్రస్తావనల్లో సంయమనం ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత ప్రధానంగా అగ్రనేతలపై ఉందని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని ఎన్నికల సంఘం తాజాగా మరోసారి ప్రధాన పార్టీలకు గుర్తు చేసింది.

కాగా, జార్ఖండ్ రాష్ట్రంలో ఇప్పటికే తొలి దశ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. నవంబర్ 20న జార్ఖండ్ రాష్ట్రంలో రెండో దశ తోపాటు మహారాష్ట్ర అసెంబ్లీ మొత్తం స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నేతలు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒకరిపై ఒకరు తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూ రాజకీయ వేడిని పుట్టిస్తున్నారు. ఇక, నవంబర్ 23న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+