Cognizant: వామ్మో మాకొద్దీ IT ఉద్యోగం.. కంపెనీలను వణికిస్తున్న టెక్కీలు.. నిరుద్యోగులకు సదవకాశం..
Cognizant: ప్రస్తుతం ఐటీ రంగాన్ని కుదిపేస్తోన్నది ఆర్థిక మాంద్యమో లేక ప్రాజెక్టులు లేకపోవటమో కాదు. వారి సమస్య మనం ఊహిస్తున్నదానికంటే చాలా పెద్దది. అదే మానవ వనరుల కొరత. అవును కంపెనీలను ఉద్యోగులు వీడటం వారికి అతిపెద్ద ఛాలెంజ్ గా మారింది. దేశంలోని అనేక దిగ్గజ కంపెనీలకు వ్యాపారం కొదవలేదు, రానున్న రెండు మూడు సంవత్సరాలకు వరకు ప్రాజెక్టులు క్యూలో ఉన్నాయి. అసలు అతిపెద్ద సమస్య ఎందుకు వచ్చింది.. దీని వల్ల కొత్త టెక్కీలకు లాభమా..? లేక నష్టమా..? ఇప్పుడు తెలుసుకుందాం..

కాగ్నిజెంట్ కష్టాలు..
అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ చరిత్రలోనే అత్యంత దారుణమైన త్రైమాసికాన్ని చూసింది. అవును కేవలం 90 రోజుల వ్యవధిలో దాదాపుగా 1.20 లక్షల మంది టెక్కీలు ఈ కంపెనీకి రాజీనామా చేశారు. ప్రతి 100 మంది ఉద్యోగుల్లో 36 మంది కంపెనీకి గుడ్ బై చెప్పినట్లు షాకింగ్ గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. వరుసగా అట్రిషన్ రేటు 30 శాతం కంటే ఎక్కువగా ఉండటం ఇది ఐదవ త్రైమాసికంగా తెలుస్తోంది.

దేశంలోని ఇతర కంపెనీలు..
భారత్ లో ప్రఖ్యాత ఐటీ కంపెనీలుగా ఉన్నవాటికి సైతం ఈ సంస్య ఉంది. ఇన్ఫోసిస్ 28.4 శాతం, టీసీఎస్ 19.7 శాతం, విప్రో 23.3 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 23.8 శాతం అట్రిషన్ రేటును కలిగి ఉన్నాయి.

కంపెనీకి ఉన్న ఇబ్బందులు..
* కంపెనీలకు ముఖ్యమైన సీనియర్ సిబ్బంది నష్టం
* గతంలో టెక్నాలజీ/గ్రోత్ కంపెనీలతో సీనియర్ సిబ్బందిని రిక్రూట్ చేయడంలో అసమర్థత
* పెద్ద డీల్స్/లావాదేవీలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవటం
* అవసరాలకు తగిన విధంగా సిబ్బంది నియామకాలు చేసుకోలేకపోవటం, ఆదాయ వృద్ధిని తగ్గించడం
* కంపెనీకి పోటీదారులుగా ఉన్న INFY, TCS, Accenture తో పోలిస్తే గ్రోత్ విషయంలో వెనకపడటం
* ఇతర ఆర్థిక అంశాలు కంపెనీ దయనీయ పరిస్థితులకు కారణాలు

కంపెనీ లాభాలు..
జూన్ 30తో ముగిసిన రెండవ త్రైమాసికంలో కంపెనీ 577 మిలియన్ డాలర్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఇది గడచిన ఏడాదితో పోల్చితే 12.7 శాతం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 3,41,300గా ఉంది. భారత కంపెనీల్లో గణాంకాలు ఇలా ఉన్నాయి.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications