ఎక్కడో స్విట్జర్లాండ్ కాదండోయ్.. మన వద్దే: బెస్ట్ టైమ్ టు విజిట్..!!
Snowfall: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాల వల్ల దక్షిణాది రాష్ట్రాలను వరుస అల్పపీడనాలు, తుఫాన్లు ముంచెత్తాయి. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి సహా ఏపీ, కర్ణాటకల్లోనూ అతి భారీ వర్షాలు పడుతున్నాయి. తమిళనాడులో పాఠశాలలకు సైతం సెలవులను ప్రకటించాల్సి వచ్చింది.
దక్షిణాది పరిస్థితి ఇలా ఉంటే ఉత్తరాది రాష్ట్రాలను చలి వెంటాడుతోంది. గజగజమంటూ వణికిస్తోంది. డిసెంబర్ తొలి వారం నుంచే చలిగాలులు దాదాపుగా అన్ని రాష్ట్రాలను చుట్టుముట్టాయి. దట్టమైన పొగమంచు అలముకుంటోంది. దేశ రాజధాని సహా నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో గడ్డకట్టించే వాతావరణం నెలకొంటోంది.

హిమాలయాల పశ్చిమ ప్రాంతం మీదుగా వీస్తోన్న గాలుల ప్రభావం వల్ల చలి అమాంతంగా పెరిగినట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. మున్ముందు రాత్రి ఉష్ణోగ్రత మరింత క్షీణించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రజలు ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని సూచించింది.
గత 24 గంటల వ్యవధిలో ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. టెంపరేచర్ 4 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. ఈ స్థాయిలో ఉష్ణోగ్రత క్షీణించడం 34 సంవత్సరాల తరువాత ఇదే తొలిసారి. చివరిసారిగా 1987 డిసెంబర్ 6వ తేదీన 4.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత దేశ రాజధానిలో నమోదైంది. ఇప్పుడా రికార్డు చెరిగిపోయింది.
సఫ్దర్ గంజ్, అక్షర్‌ధామ్, ద్వారకా, పాలం వంటి ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రోజువారీ సగటుతో పోల్చుకుంటే 0.4 డిగ్రీల సెల్సియస్ మేర తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది ఆయా ప్రాంతాల్లో. ఈ నెల పొడవునా దాదాపుగా ఇదే పరిస్థితి ఉండొచ్చని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. చలిగాలుల తీవ్రత మున్ముందు మరింత పెరుగుతుందని, సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుందని పేర్కొంది.
అటు జమ్మూ కాశ్మీర్‌లో ఏకధాటిగా మంచు వర్షం కురుస్తోంది. గందర్‌బల్, సోపొర్, బండీపొర, కుప్వారాల్లో దీని తీవ్రత అత్యధికంగా కనిపిస్తోంది. మంచు దుప్పటి కప్పుకొన్నట్లు కనిపిస్తోన్నాయా ప్రాంతాలన్నీ కూడా. చెట్లు, ఇళ్ల పైకప్పులపై దట్టంగా మంచు పేరుకుపోయింది. ఇళ్ల బయట పార్క్ చేసి ఉంచిన వాహనాలను మంచు కప్పేసింది.
#WATCH | Jammu and Kashmir: Kupwara covered in a blanket of snow, as the area receives heavy snowfall pic.twitter.com/9HqVmRryyj
— ANI (@ANI) December 12, 2024
రోడ్లపై నాలుగైదు అంగుళాల మేర మంచు ఏర్పడటంతో వాహనాల రాకపోకలు నెమ్మదించాయి. జమ్మూలో కనిష్ఠ ఉష్ణోగ్రత తొమ్మిది డిగ్రీల సెల్సియస్‌గా రికార్డయింది. అక్కడి ప్రఖ్యాత దాల్ లేక్ గడ్డకట్టుకుపోయిన స్థితిలో కనిపించింది. భూతల స్వర్గంగా మారింది. మంచు కురుస్తోన్న నేపథ్యంలో పర్యాటకుల తాకిడి పెరిగే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications