దారుణంగా పెరిగిన చలి

Cold Wave: ఉత్తరాది రాష్ట్రాలను చలి వెంటాడుతోంది. గజగజమంటూ వణికిస్తోంది. చలిగాలులు దాదాపుగా అన్ని రాష్ట్రాలను చుట్టుముట్టాయి. దట్టమైన పొగమంచు అలముకుంటోంది. దేశ రాజధాని సహా నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో గడ్డకట్టించే వాతావరణం నెలకొంటోంది.

హిమాలయాల పశ్చిమ ప్రాంతం మీదుగా వీస్తోన్న గాలుల ప్రభావం వల్ల చలి అమాంతంగా పెరిగినట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. మున్ముందు రాత్రి ఉష్ణోగ్రత మరింత క్షీణించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రజలు ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని సూచించింది.

Cold Wave grips Delhi-NCR and other cities

గత 24 గంటల వ్యవధిలో కనిష్ఠ ఉష్ణోగ్రత పంజాబ్‌లో నమోదైంది. ఇక్కడి ఆదంపూర్‌లో టెంపరేచర్ మైనస్‌లో పడిపోయింది. -0.4గా రికార్డయింది. హిమాచల్ ప్రదేశ్ సరిహద్దులకు సమీపంలో ఉండే గ్రామం ఇది. దీని తరువాత హర్యానా హిసార్‌లో అత్యల్పంగా 1.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హిమాలయ పర్వత శ్రేణుల మీదుగా వీస్తోన్న చలిగాలులు, అక్కడ కురుస్తోన్న మంచు వర్షం వల్ల చలిగాలుల తీవ్రత ఇక్కడ ఒక్కసారిగా పెరిగింది.

చురు- 7.1, పంజాబ్ అమృత్‌సర్- 5.8, ఫరీద్ కోట్- 4.9, పఠాన్‌కోట్- 4.5. భటిండా- 4.8, గుర్‌దాస్‌పూర్- 4.7, కర్నాల్- 6.6 డిగ్రీల సెల్సియస్ మేర కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రోహ్‌తక్- 3.8, కరౌలీ- 4.7, ఫతేపూర్- 2.8, గంగానగర్- 4.9, ఢోల్‌పూర్- 5.3, సిరోహి- 5.1, నాగౌర్- 4.5, పిలానీ- 5.4, అల్వార్- 4.0, సికార్- 4.9 డిగ్రీల సెల్సియస్ మేర కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+