కలెక్టర్‌తో మాయవతి బూట్లు పాలిష్ చేపిస్తా..! మరోసారి నోరు జారిన అజం ఖాన్
రాంపూర్ : ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ లోక్‌సభ సెగ్మెంట్ నుంచి బరిలో నిలిచిన సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అజం ఖాన్ మరోసారి నోరు జారారు. ఇప్పటికే తన ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి జయప్రదపై ఆయన చేసిన కామెంట్స్ తాలూకు వేడి చల్లారలేదు. ఆమె ఖాకీ అండర్‌వేర్ వేసుకున్నారనే వ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఆ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం మొట్టికాయలు కూడా వేసింది. మంగళవారం (16.04.2019) ఉదయం 10 గంటల నుంచీ మూడు రోజులు ఎన్నికల ప్రచారం చేయొద్దని ఆదేశించింది. అయినా కూడా అజం ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు ఆపడం లేదు.
జయప్రదపై అజం ఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యల వేడి ఇంకా చల్లారకముందే.. పబ్లిక్ ర్యాలీలో మరోసారి వివాదస్పద కామెంట్స్ చేశారు. జిల్లా కలెక్టర్ కు భయపడాల్సిన అవసరం లేదని మాట్లాడుతూ టంగ్ స్లిప్పయ్యారు. కలెక్టర్ ను తీసుకెళ్లి మాయావతి బూట్లు పాలిష్ చేపిస్తా అంటూ అదోరకంగా మాట్లాడారు.













Click it and Unblock the Notifications