College gilr: కాలేజ్ అమ్మాయిని లాక్కెళ్లిన 10 తరగతి అబ్బాయి, సీన్ కట్ చేస్తే ? కుక్క వచ్చిందని !
తిరువనంతపురం/మల్లప్పురం : కాలేజ్ కు వెళ్లి వస్తున్న యువతి మీద 10వ తరగతి చదువుతున్న అబ్బాయి కన్నుపడింది. 16 ఏళ్ల వయసులోనే అతని కంటే 5 సంవత్సరాల ఎక్కువ వయసు ఉన్న యువతి మీద మోజు పడిన ఆ అబ్బాయి ఆమెను లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు. కంప్యూటర్ క్లాస్ కు వెళ్లి వస్తున్న యువతిని సమీపంలోని పొలంలోకి లాక్కెళ్లిన అతను ఆమె మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడు. యువతి ఎదురు తిరగడంతో పక్కనే ఉన్న ఒకరాయి తీసుకుని ఆమె ముఖం మీద దాడి చేశాడు. యువతి శరీరం మీద ఉన్న దుస్తులు చింపేశాడు. యువతి మీద అత్యాచారం చెయ్యడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. స్వతహాగా రాష్ట్రస్థాయి జూడో ఛాంపియన్ అయిన ఆ అబ్బాయి నుంచి ఆమె అంత త్వరగా తప్పించుకోలేకపోయింది. అత్యాచారం చెయ్యడానికి అతను అనేక ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఓ కుక్క అటువైపు వెళ్లింది. కుక్క వెళ్లడంతో భయపడిన ఆ అబ్బాయి అక్కడి నుంచి పరారైనాడు. బాధితురాలు తప్పించుకుని అర్దనగ్నంగా పరుగు తీసి సమీపంలోని ఇంటికి వెళ్లి తలదాచుకుని స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం బయటకు వచ్చింది.

జూడో ఛాంపియన్
కేరళలోని మల్లప్పురం జిల్లాలోని కొండట్టిలో 21 ఏళ్ల యువతి నివాసం ఉంటున్నది. ఇదే ప్రాంతంలో 16 ఏళ్ల అబ్బాయి నివాసం ఉంటున్నాడు. 10వ తరగతి చదువుతున్న ఆ అబ్బాయి చాలా కాలం నుంచి ఆన్ క్లాసుల్లో చదువుతున్నాడు. చదువుతో పాటు జూడో ఛాంపియన్ గా సత్తాచాటుకున్న ఆ అబ్బాయి రాష్ట్రస్థాయి జూడో ఛాంపియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

యువతి మీద కన్ను పడింది
ఇటీవల కాలేజ్ అమ్మాయి కొండోట్టిలోని ఓ కంప్యూటర్ కోచింగ్ సెంటర్ కు వెలుతోంది. ప్రతిరోజు కంప్యూటర్ కోచింగ్ సెంటర్ కు వెలుతున్న యువతి సాయంత్రం పొద్దుపోయిన తరువాత నడుచుకుంటూ ఇంటికి వెలుతోంది. కాలేజ్ యువతి మీద 10వ తరగతి చదువుతున్న అబ్బాయి కన్నుపడింది.

చాన్స్ కోసం ఎదురు చూశాడు
16 ఏళ్ల వయసులోనే బాగా ఎత్తుగా బలంగా ఉన్న జూడో ఛాంపియన్ అతని కంటే 5 సంవత్సరాల ఎక్కువ వయసు ఉన్న యువతి మీద మోజు పడ్డాడు. కాలేజ్ అమ్మాయిని ఎలాగైపా లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు. అయితే 10వ తరగతి చదువుతున్న అబ్బాయి చేష్టల గురించి ఆమె పెద్దగా పట్టించుకోలేదని తెలిసింది. మంచి చాన్స్ చూసి యువతి మీద అత్యాచారం చెయ్యాలని ఆ అబ్బాయి ఎదురు చూశాడు

పొలంలోకి లాక్కెళ్లిపోయాడు
కంప్యూటర్ క్లాస్ కు వెళ్లి వస్తున్న యువతిని అడ్డగించిన ఆ అబ్బాయి ఆమెను బలవంతంగా రోడ్డు పక్కన సమీపంలోని పొలంలోకి లాక్కెళ్లాడు. తరువాత అతను ఆమె మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడు. యువతి ఎదురు తిరగడంతో పక్కనే ఉన్న ఒకరాయి తీసుకుని ఆమె ముఖం మీద దాడి చేశాడు. యువతి శరీరం మీద ఉన్న దుస్తులు చింపేశాడు. యువతి మీద అత్యాచారం చెయ్యడానికి అనేక ప్రయత్నాలు చేశాడు.

కుక్కరావడంతో పరారైనాడు
10వ తరగతి అబ్బాయి స్వతహాగా రాష్ట్రస్థాయి జూడో ఛాంపియన్ కావడం, లావుగా, పొడవుగా ఉండటంతో ఆ అబ్బాయి నుంచి ఆమె అంత త్వరగా తప్పించుకోలేకపోయింది. అత్యాచారం చెయ్యడానికి అతను అనేక ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఓ కుక్క అటువైపు వెళ్లింది. కుక్క వెళ్లడంతో భయపడిన ఆ అబ్బాయి యువతిని అక్కడే వదిలేసి అక్కడి నుంచి పరారైనాడు.

పరుగు తీసిన కాలేజ్ అమ్మాయి
బాధితురాలు తప్పించుకుని అర్దనగ్నంగా పరుగు తీసి సమీపంలోని ఇంటికి వెళ్లి తలదాచుకుని స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం బయటకు వచ్చింది. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సుజిత్ దాస్ రంగంలోకి దిగారు. యువతిని కోజికోడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యపరీక్షలు చేయించామని జిల్లా ఎస్పీ సుజిత్ దాస్ స్థానిక మీడియాకు చెప్పారు.

అవును... అత్యాచారయత్నం నిజమే
గతంలో 10వ తరగతి అబ్బాయి మీద ఎలాంటి నేరచరిత్రలేదని, అతను యువతి మీద అత్యాచారయత్నం చేసిన మాట వాస్తవమే అని జిల్లా ఎస్సీ సుజిత్ దాస్ మీడియాకు చెప్పారు. యువతి, ఆమె తండ్రి ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని జిల్లా ఎస్పీ సుజిత్ దాస్ స్థానిక మీడియాకు చెప్పారు. 10వ తరగతి అబ్బాయి కాలేజ్ అమ్మాయి మీద అత్యాచారయత్నం చెయ్యడం కేరళలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications