ఆమె అశ్లీల వీడియోలే చూపించి, కారులో స్నేహితుడు రేప్
సూరత్: 22 ఏళ్ల కాలేజీ యువతి పైన స్నేహితుడు కారులో అత్యాచారానికి పాల్పడిన దారుణ సంఘటన సూరత్‌లో జరిగింది. ఆ యువతి డిసెంబర్ 15వ తేదీన అత్యాచారానికి గురైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంతేకాదు, ఆమెకు చెందిన ఓ అశ్లీల వీడియోగా తీసి, ఎవరికైనా చెబితే వాటిని అందరికీ పంపిస్తానని బెదిరించాడు.
తాను పెదవి విప్పినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా వాటిని ఇంటర్నెట్లో అప్ లోడ్ చేస్తాడని బెదిరిపోయిన యువతి వెంటనే ఎవరికీ చెప్పలేదు. ఆమె తీవ్రంగా గాయపడటంతో తల్లిదండ్రులు ప్రశ్నించారు. ఆమె విషయం చెప్పింది. దీంతో వారు ఆదివారం నాడు సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాధితురాలి కుటుంబ సభ్యులు, నిందితుడి కుటుంబ సభ్యులు టెక్స్‌టైల్ బిజినెస్ చేస్తున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైన సమాచారం మేరకు... నిందితుడు డిసెంబర్ 15వ తేదీన బాధిత యువతిని తన కారులో వివిధ ప్రాంతాలకు తీసుకు వెళ్లాడు.
ఆమెకు చెందిన ఓ వీడియోను చూపించి బెదిరించాడు, అత్యాచారానికి పాల్పడ్డాడు. అతను ఆ బాధిత యువతి వీడియోను ఇటీవలే తీసినట్లుగా గుర్తించారు. నిందితుడు, బాధితురాలు ఇరువురు కూడా ఏళ్లుగా ఒకరికొకరు తెలుసు. వారు ఒకే పాఠశాలలో చదివారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications