ఇక్కడ సేఫ్ కాదని గుడిలోకి తీసికెళ్లి మిత్రులతో గ్యాంగ్ రేప్
ఇండోర్: నిర్మాణంలో ఉన్న ఓ శివాలయంలో కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ ధామ్నోద్ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారంనాడు ఈ దురాగతం చోటు చేసుకుంది.
పాట్లవాద్ గ్రామంలో తన మిత్రుడిని కలవడానికి కాలేజీ విద్యార్థిని వచ్చింది. అతని కోసం బస్టాప్‌లో కూర్చుని వేచి చూస్తోంది. ఇది గమనించిన ఓ వ్యక్తి ఆమె వద్దకు వచ్చి ఇక్కడ సురిక్షతం కాదని, దగ్గరలో ఉన్న గుడిలోకి వెళ్లి కూర్చోవాలని చెప్పాడు.

అతని మాటలు నమ్మి వెళ్లింది...
అతని మాటలు నమ్మి ఆ అమ్మాయి నిర్మాణంలో ఉన్న శివాలయంలోకి వెళ్లి కూర్చుంది. ఆ ఆగంతకుడు తన ఇద్దరు స్నేహితులకు సైగ చేశాడు. వాళ్లు కూడా ఆలయంలోకి వెళ్లారు. అక్కడే ఆమెపై వారు అత్యాచారం జరిపి పారిపోయారు.

పోలీసు స్టేషన్లో ఫిర్యాదు
జరిగిన ఘోరం నుంచి తేరుకున్న అమ్మాయి తనకు అన్యాయంపై పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అత్యాచారం చేసిన ముగ్గురిలో ఒకరికి బైక్ ఉంది. ఆ బైక్‌పై సంజు బాబా అనే స్టిక్కర్ ఉంది.ఆ విషయాన్ని ఆమె పోలీసులకు చెప్పింది.

అదుపులోకి తీసుకుని విచారించగా...
బాధితురాలు చెప్పిన వివరాలతో సంజయ్ పటేల్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిచారడు. దీంతో అతను నేరాన్ని అంగీరించాడు. మిగిలిన ఇద్దరి పేర్లు కూడా చెప్పాడు. వారిద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరు అఖిలేష్ పటేల్, మహదేవ్ పాటిదార్.

సెటిల్ చేసుకోవడానికి వచ్చి...
తన ప్రియుడితో ఉన్న విభేదాలను పరిష్కరించుకోవడానికి 23 ఏళ్ల బాధితురాలు అక్కడికి వచ్చింది. తనపై దురాగతం జరిగిన తర్వాత ఆమె తన మిత్రుడికి ఫోన్ చేసింది. అయితే, అది స్విచాఫ్ అయి ఉంది. మరో ఫ్రెండ్‌కు ఫోన్ చేస్తే పోలీసులను పిలిచారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications