యువకుల వేధింపు: రైలునుండి దూకిన ఇంజనీరింగ్ గర్ల్
కోల్‌కతా: కొందరు యువకులు తనను వేధిస్తుండటంతో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని రైలు నుండి దూకడంతో గాయాలపాలైన సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని మిడ్నాపూర్ జిల్లాలో గురువారం సాయంత్రం జరిగింది. యువకుల వేధింపులు తాళలేక ఆ విద్యార్థిని కదులుతున్న రైలు నుండి దూకేసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బాధిత విద్యార్థిని హౌరా - మిడ్నాపూర్ లోకల్ రైలులో తన స్వగ్రామమైన తమ్‌లుక్‌కు వస్తోంది. ఆమె ప్రయాణిస్తుండగా కొందరు యువకులు ఆమెను వేధించారు.ట
దీంతో ఆమె వారి బారి నుండి తప్పించుకోవడానికి ఆ కంపార్టుమెంటులో ఉన్న డోర్ వద్దకు వచ్చింది. యువకులు వేధిస్తుండటంతో ఆమె ఒక్కసారిగా రైలు నుండి దూకేసింది. పశ్చిమ మిడ్నాపూర్‌లోని పంస్కురా ప్రాంతంలో ఆమె రైలు నుండి దూకేసింది.
కిందపడ్డ ఆమెను పలువురు స్థానికులు గుర్తించి తమ్‌లుక్ ఆసుపత్రికి తరలించారు. బాధిత విద్యార్థిని గాయాలు బాగా అయ్యాయని అయినా ఆరోగ్య పరిస్థితి విషమంగా లేదని వైద్యులు చెప్పారు.
బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలువురు యువకులు తన కూతురును కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని తల్లిదండ్రులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్యార్థిని కోల్‌కతా సమీపంలోని ఓ ప్రయివేటు కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతోంది.












Click it and Unblock the Notifications