కాలేజ్ అమ్మాయి లవ్ స్టోరీ, తక్కువ కులం వాడు కావాలా ? ప్రైవేట్ పార్ట్స్ లో కాల్చి చంపిన సోదరుడు!

మీరట్/లక్నో: తక్కువ కులం వాడిని ప్రేమిస్తుందని, మా మాట వినకుండా అతనితో తిరుగుతూ మా పరువు తీస్తోందని వరుసకు సోదురుడు అయ్యే యువకుడు కాలేజ్ అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ మీద రివాల్వర్ తో కాల్చి అతి దారుణంగా హత్య చేశాడు. కళ్ల ముందే యువతిని హత్య చేస్తున్న సమయంలో అక్కడే ఆమె తల్లిదండ్రులతో పాటు హంతకుడి తల్లిదండ్రులు ఉన్నారు. అయితే దుండగులు బంగారు నగల కోసం యువతిని హత్య చేశారని కేసు తప్పుదొవ పట్టించడానికి తల్లిదండ్రులు ప్రయత్నించడంతో వారి మీద కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

ఇంటర్ కాలేజ్ అమ్మాయి

ఇంటర్ కాలేజ్ అమ్మాయి

ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో నివాసం ఉంటున్న టీనా చౌదరి (19) ఇంటర్ (ఫ్లస్ టూ) విద్యాభ్యాసం చేస్తున్నది. టీనా చౌదరి ప్రతిరోజూ కాలేజ్ కు వెలుతోంది. కాలేజ్ లో తనతో పాటు చదువుతున్న ఓ యువకుడిని టీనా చౌదరి ప్రేమించింది. అయితే టీనా చౌదరి కులం కంటే ఆ యువకుడు (ప్రియుడు) కులం తక్కువ అని తెలిసింది.

కులం తక్కువ వాడితో లవ్!

కులం తక్కువ వాడితో లవ్!

టీనా చౌదరి కులం తక్కువ వాడితో ప్రేమలో పడిందని, అతనితో తిరుగుతోందని తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు తీవ్రస్థాయిలో మందలించారు. నువ్వు ఆ యువకుడితో తిరగడం మాకు ఇష్టం లేదని, బుధ్దిగా చదువుకున్న తరువాత వేరే వ్యక్తిని చూసి తాము పెళ్లి జరిపిస్తామని టీనా చౌదరికి ఆమె కుటుంబ సభ్యులు గట్టిగా చెప్పారు.

రగిలిపోయిన సోదరుడు

రగిలిపోయిన సోదరుడు

టీనా చౌదరికి వరుసకు సోదరుడు అయ్యే ప్రశాంత్ అలియాస్ కిట్టుకు వీరి ప్రేమ విషయం తెలిసింది. జులాయిగా స్నేహితులతో తిరిగే కిట్టు సైతం టీనా చౌదరిని హెచ్చరించాడు. నువ్వు తక్కువ కులం వాడితో తిరుగుతున్నావని అందరికీ తెలిసిపోయిందని, మర్యాదగా ఇంటిలో చెప్పినట్లు వినాలని, లేదంటే చంపేస్తానని కిట్టు సోదరి టీనా చౌదరిని హెచ్చరించాడు.

మద్యం మత్తులో కిరాతకంగా హత్య

మద్యం మత్తులో కిరాతకంగా హత్య

రాత్రి స్నేహితుడి బర్త్ డే పార్టీకి వెళ్లిన కిట్టు, అతని స్నేహితుడు సల్మాన్ పీకలదాక మద్యం సేవించారు. తరువాత బర్త్ డే పార్టీ నుంచి నేరుగా టీనా చౌదరి ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో ప్రేమికుడి విషయంలో టీనా చౌదరితో కిట్టు గొడవ పెట్టుకున్నాడు. తాను ప్రేమించిన యువకుడినే పెళ్లి చేసుకుంటానని టీనా చౌదరి తేల్చి చెప్పింది. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన కిట్టు జోబులో ఉన్న రివాల్వర్ తీసుకుని టీనా చౌదరి ప్రైవేట్ పార్ట్ష్ తో పాటు ఆమె చాతి, కాలి తొడ మీద మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు.

ప్రైవేట్ ఆసుపత్రికి రహస్యంగా

ప్రైవేట్ ఆసుపత్రికి రహస్యంగా

ఒక్కసారిగా రివాల్వర్ తో కాల్పులు జరపడంతో టీనా చౌదరి కుప్పకూలిపోయింది. వెంటనే టీనా చౌదరిని రహస్యంగా ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే టీనా చౌదరి మరణించిందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మొదట దుండగులు బంగారు నగలు, నగదు దోచుకోవడానికి టీనా చౌదరిని హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను నమ్మించడానికి ప్రయత్నించారు.

ఇక్కడ ఏం జరిగింది?

ఇక్కడ ఏం జరిగింది?

సంఘటనా స్థలంలో పగిలిన గాజు ముక్కలు చిక్కడం, రక్తపు మరకలు తుడచడానికి ప్రయత్నించిన విషయం గుర్తించిన పోలీసులకు అనుమానాలు ఎక్కువ అయ్యాయి. ఇక్కడ ఏం జరిగిందో చెప్పాలని టీనా చౌదరి కుటుంబ సభ్యులను పోలీసులు గట్టిగా ప్రశ్నించారు. పోలీసులు అనేక ప్రశ్నలు వెయ్యడంతో టీనా చౌదరి కుటుంబ సభ్యులు హడలిపోయారు.

Recommended Video

    నల్లమల అడవిలో... తప్పిపొయిన 6 ఏళ్ల పసిపాప!! | Oneindia Telugu
    మావాడే కాల్చి చంపాడు!

    మావాడే కాల్చి చంపాడు!

    పోలీసులు వేసిన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అయిన టీనా చౌదరి కుటుంబ సభ్యులు జరిగిన విషయం మొత్తం చెప్పారు. టీనా చౌదరి వేరే యువకుడిని ప్రేమించిందని, ఎంత చెప్పినా ఆమె, ప్రియుడు మా మాట వినలేదని పోలీసులకు చెప్పారు. ఈ విషయం తెలిసిన టీనా చౌదరి సోదరుడు (కజిన్ బ్రదర్) కిట్టు, అతని స్నేహితుడు సల్మాన్ కలిసి రివాల్వర్ తో కాల్చడంతో ఆమె మరణించిందని కుటుంబ సభ్యులు పోలీసుల ముందు అంగీకరించారు. కిట్టు, అతని స్నేహితుడు సల్మాన్ పరారైనారని, వారి కోసం గాలిస్తున్నామని మీరట్ పోలీసులు తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+