Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

College girl: కాలేజ్ లో లైంగిక వేధింపులు, ఇంటర్ అమ్మాయి ఆత్మహత్య, భయంతో లెక్చరర్ కూడా !

చెన్నై/ కరూర్: కాలేజ్ లో లెక్చరర్ లైంగిక వేధింపులు ఎక్కువ అయ్యాయని ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్ చదువుతున్న అమ్మాయి ఆత్మహత్య చేసుకునే ముందు డెత్ నోట్ రాసి పెట్టింది. అయితే తన ఆత్మహత్యకు ఈయనే కారణం అనే పేరు మాత్రం ఆ విద్యార్థి రాయలేదు. ఇంటర్ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ అమ్మాయి కాలేజ్ లోనే లెక్చరర్ గా పపి చేస్తున్న వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అమ్మాయి ఆత్మహత్యకు ఆ లెక్చరర్ కారణం అని అందరూ ఆరోపిస్తున్న సమయంలో ఆయన ఆత్మహత్య చేసుకోవడం దూమరం రేపింది. ఆత్మహత్య చేసుకునే ముందు లెక్చరర్ కూడా డెత్ నోట్ రాసిపెట్టడంతో దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 ఇంటర్ అమ్మాయి

ఇంటర్ అమ్మాయి

తమిళనాడులోని కరూర్ సమీపంలోని ఇంటర్ కాలేజ్ లో లెక్చరర్ లైంగిక వేధింపులు ఎక్కువ అయ్యాయని ఆరోపిస్తూ అదే కాలేజ్ లో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న అమ్మాయి ఇటీవల ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్ చదువుతున్న అమ్మాయి ఆత్మహత్య చేసుకునే ముందు డెత్ నోట్ రాసి పెట్టింది.

 కామాంధుడిని అరెస్టు చెయ్యాలని డిమాండ్

కామాంధుడిని అరెస్టు చెయ్యాలని డిమాండ్

అమ్మాయి రాసిన డెత్ నోట్ ను కేసు విచారణ చేస్తున్న వెంగమేడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే తన ఆత్మహత్యకు ఈయనే కారణం అనే పేరు మాత్రం ఆ విద్యార్థి రాయలేదు. ఇంటర్ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు.

 ఆత్మహత్య చేసుకున్న లెక్చరర్

ఆత్మహత్య చేసుకున్న లెక్చరర్

ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి చదువుతున్న కాలేజ్ లోనే మ్యాథ్స్ పాఠాలు చెబుతున్న శరవణన్ కారణం అని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే లెక్చరర్ శరవణన్ ను పోలీసులు విచారణ చేసి వివరాలు సేకరించారు. ఇదే సమయంలో ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ అమ్మాయి కాలేజ్ లోనే లెక్చరర్ గా పపి చేస్తున్న శరవణన్ కూడా తిరుచ్చి జిల్లాలోని సెంకట్టుపట్టిలోని అతని బావ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

 డెత్ నోట్ రాసిపెట్టిన లెక్చరర్

డెత్ నోట్ రాసిపెట్టిన లెక్చరర్

ఇంటర్ అమ్మాయి ఆత్మహత్యకు లెక్చరర్ శరవణన్ కారణం అని అందరూ ఆరోపిస్తున్న సమయంలో ఆయన ఆత్మహత్య చేసుకోవడం దూమరం రేపింది. ఆత్మహత్య చేసుకునే ముందు లెక్చరర్ శరవణన్ కూడా డెత్ నోట్ రాసిపెట్టడంతో దానిని తిరుచ్చి జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Recommended Video

    South Africa: The College of Magic In Cape Town
     నాకు ఎలాంటి సంబంధం లేదు

    నాకు ఎలాంటి సంబంధం లేదు

    అమ్మాయిని తాను లైంగిక వేధింపులకు గురి చెయ్యలేదని, ఆమె ఆత్మహత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదని, కావాలనే తన మీద ఆరోపణలు చెయ్యడంతో అవమానంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని, నా కుటుంబ సభ్యులు, విద్యార్థులు అందరూ తనకు దూరం అయ్యారని ఆవేదనతో ఆత్మహత్య చేసుకుంటున్నానని శరవణన్ డెత్ నోట్ లో రాసిపెట్టాడని పోలీసు అధికారులు అంటున్నారు. శరవణన్ లైంగిక వేధింపుల కారణంగానే ఇంటర్ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని ఆరోపణలు ఉన్నాయి. పోలీసులకు భయపడి శరవణన్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని ఆరోపణలు ఉన్నాయి.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+