అటెండర్ మహేష్ దగ్గర రివాల్వర్: ఎవరితో లింకులు?
బెంగళూరు: ప్రగతి కాలేజ్ పీయుసీ విద్యార్థినిని రివాల్వర్ తో కాల్చి చంపిన మహేష్ ను పోలీసు అధికారులు విచారిస్తున్నారు. నిందితుడు మహేష్ దగ్గరకు రివాల్వర్ ఎలా వచ్చిందని ఆరా తీస్తున్నారు. శివమొగ్గ జిల్లాలో మావోయిస్ట్ లు (నక్సల్) ప్రభావం చాలా ఉంది. శివమొగ్గ జిల్లాలోని అగుంబే ప్రాంతానికి చెందిన మహేష్ కు మావోయిస్ట్ లకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అని పోలీసు అధికారులు కూపీలాగుతున్నారు.
అగుంబెలోని దట్టమైన అటవి ప్రాంతంలో నిత్యం పోలీసులు కూబింగ్ నిర్వహిస్తుంటారు. అదే ప్రాంతానికి చెందిన మహేష్ బెంగళూరు చేరుకుని ప్రగతి కాలేజ్ లో అటెండర్ గా పని చేస్తున్నాడు. ఒక కాలేజ్ లో అటెండర్ గా పని చేసే మహేష్ దగ్గర రివాల్వర్ ఉందంటే తాము నమ్మలేకపోతున్నామని పోలీసు అధికారులు అంటున్నారు. హత్య చేసిన నిందితుడు మహేష్ నేరుగా బి నారాయణపురలోని సోదరి ఇంట్లో తలదాచుకున్నాడు.

మహేష్ సోదరి అద్దె ఇంటిలో ఉంటోంది. బుధవారం ఉదయం ఇంటి యజమాని, టీవీలలో ప్రతిభ కాలేజ్ లో హత్య జరిగిందని, ఆ హత్య మహేష్ చేశాడని వార్తలు రావడాన్ని చూశాడు. వెంటనే ఇంటి యజమాని ఈ విషయమై మహేష్ ను ప్రశ్నించాడు.
మహేష్ అక్కడి నుండి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఇంటి యజమాని, స్థానికులు వెంటాడి అతనిని పట్టుకుని తాళ్లతో కట్టి వేసి బెంగళూరు పోలీసు అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు మహేష్ ను అరెస్టు చేశారు. హత్య చేసిన మహేష్ దర్జాగా బెంగళూరులోనే తల దాచుకొవడంతో పోలీసులు పలు కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications