Students: బుర్కాలు వేసుకుని వెళ్లిన అమ్మాయిలు, గేట్ మూసేసిన ప్రిన్సిపాల్, జైశ్రీరామ్ కండువాలతో !
బెంగళూరు/ఉడిపి: కాలేజ్ లో చదవే అమ్మాయిలు బుర్కాలు వేసుకుని కాలేజ్ లోకి వస్తే మేము కూడా కాషాయం కండువాలు వేసుకుని వచ్చి జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తాము అంటూ కాలేజ్ లో చదువుతున్న అబ్బాయిలు మొండికేయడం కలకలం రేపింది. బుర్కాలు వేసుకుని కాలేజ్ లోకి వెళ్లి చదువుకోవడానికి ప్రయత్నించిన అమ్మాయిలను కాలేజ్ ప్రిన్సిపాల్ గేట్ దగ్గరే నిలిపేశారు. ఇదే సమయంలో బుర్కాలువేసుకుని వస్తున్న కాలేజ్ అమ్మాయిలను కాలేజ్ లోకి అనుమతిస్తే మమ్మల్ని కూడా కాలేజ్ లోపలికి పంపించాలని కొందరు విద్యార్థులు కాషాయం కండువాలు వేసుకుని జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ గేట్ దగ్గరకు వెళ్లారు. కాలేజ్ లో విద్యార్థులు వేసుకునే యూనీఫామ్ తప్పా ఏమతానికి చెందిన దుస్తులు ధరించి కాలేజ్ లోపలికి రావడానికి అనుమతించకూదని హోమ్ మంత్రి, జిల్లా ఇన్ చార్జ్ మంత్రి తేల్చి చెప్పారు. ఇప్పుడు బుర్కా, కాషాయం కండువా వివాదం జిల్లా మొత్తం వ్యాపించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఉడిపి కాలేజ్ లో బుర్కా వివాదం
కర్ణాటకలోని ఉడిపిలోని ప్రభుత్వ కాలేజ్ లో చదువుతున్న ముస్లీం అమ్మాయిలు బుర్కా (హిజూబ్) ధరించి కాలేజ్ కు రాకూడదని కాలేజ్ ప్రిన్సిపాల్ ఆదేశాలు జారీ చేశారు. కొన్ని రోజుల నుంచి బుర్కాలు వేసుకుని వస్తున్న కాలేజ్ అమ్మాయిలకు కాలేజ్ ప్రిన్సిపాల్, కాలేజ్ అధ్యాపకులు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు.

ప్రైవేట్ కాలేజ్ ల్లో బుర్కా నిషేధం
ఉడిపి ప్రభుత్వ కాలేజ్ లో బుర్కాలను నిషేధించడంతో ఉడిపి జిల్లాలోని కొన్ని ప్రైవేట్ కాలేజ్ ల్లో కూడా ఆ కాలేజ్ యాజమాన్యం బుర్కాలను నిషేధించాలని నిర్ణయించారు. కాలేజ్ క్యాంపస్ లో బుర్కాలు వేసుకోకూడదని ఇప్పటికే కాలేజ్ యాజమాన్యం అమ్మాయిలకు ఆదేశాలు జారీ చేసిందని తెలిసింది.
కాలేజ్ గేట్ దగ్గర ఆపేసిన ప్రిన్సిపాల్
ఉడిపి జిల్లాలోని కుందాపుర ప్రభుత్వ కాలేజ్ లో చదువుతున్న అమ్మాయిలు ఇక ముందు హిజాబ్ (బుర్కా) వేసుకుని రాకూడదని కాలేజ్ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. బుర్కాలు వేసుకుని కాలేజ్ లోకి వెళ్లి చదువుకోవడానికి ప్రయత్నించిన అమ్మాయిలను కాలేజ్ ప్రిన్సిపాల్ గేట్ దగ్గరే నిలిపేశారు.

కాషాయం కండువాలతో జైశ్రీరామ్
కాలేజ్ లో చదవే అమ్మాయిలు బుర్కాలు వేసుకుని కాలేజ్ లోకి వస్తే మేము కూడా కాషాయం కండువాలు వేసుకుని వచ్చి జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తాము అంటూ కాలేజ్ లో చదువుతున్న అబ్బాయిలు మొండికేయడం కలకలం రేపింది. కాలేజ్ ప్రిన్సిపాల్ తో ముస్లీం అమ్మాయిలు వాగ్విదానికి దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

గొడవలతో రచ్చరచ్చ
బుర్కాలువేసుకుని వస్తున్న కాలేజ్ అమ్మాయిలను కాలేజ్ లోకి అనుమతిస్తే మమ్మల్ని కూడా కాలేజ్ లోపలికి పంపించాలని కొందరు విద్యార్థులు కాషాయం కండువాలు వేసుకుని జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ గేట్ దగ్గరకు వెళ్లారు. అయితే మతపరమైన దస్తులు వేసుకుని వస్తే ఎవ్వరిని కూడా కాలేజ్ లోపలికి అనుమతి ఇవ్వమని కాలేజ్ ప్రిన్సిపాల్ విద్యార్థులకు చెప్పారు.

ప్రిన్సిపాల్ ను నిలదీసిన అమ్మాయిలు
బర్కాలు వేసుకుని కాలేజ్ లోకి రాకూడదని ఇప్పటికే కాలేజ్ ప్రిన్సిపాల్ చెప్పారని, వాళ్లు బుర్కాలు వేసుకుని వస్తే హిందువులు కాషాయ కండువాలు వేసుకుని వస్తే కాలేజ్ క్యాపంస్ లో లేనిపోని సమస్యలు వస్తాయని సాటి విద్యార్థులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షలు మొదలైయ్యే సమయంలో బుర్కాలు వేసుకుని రాకూడదు అంటే ఎలా అంటూ కొందరు ముస్లీం అమ్మాయిలు కాలేజ్ ప్రిన్సిపాల్ ను ప్రశ్నించారు.
Recommended Video

హోమ్ మంత్రి, జిల్లా ఎన్ చార్జ్ మంత్రి క్లారిటీ
కాలేజ్ క్యాపంస్ లో మతపరమైన దస్తులు వేసుకుని రావడానికి అవకాశం లేదని, బుర్కాలు అయినా, కాషాయ కండువాలు కూడా వేసుకుని రాకూడదని ఇప్పటికే అధికారులు చెప్పారని, ఆ విషయంలో జిల్లా స్థాయి అధికారులతో చర్చలు జరిపి సరైన నిర్ణయం తీసుకుంటామని కర్ణాటక హోమ్ శాఖా మంత్రి అరగ జ్ఞానేంద్ర అన్నారు. ఇప్పటికే జిల్లా స్థాయి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయంపై చర్చించాలని నిర్ణయించామని ఉడిపి జిల్లా మంత్రి ఎస్. అగరా మీడియాకు చెప్పారు. మొత్తం మీద ఉడిపి ప్రభుత్వ కాలేజ్ లో మొదలైన బుర్కా వివాదం ఇప్పుడు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజ్ లకు వ్యాపించడంతో ఆ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications