Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

love story: నా గర్ల్ ఫ్రెండ్ కు మరో బాయ్ ఫ్రెండ్, కాలేజ్ లో లవర్ గొంతు కోసిన బాలక్రిష్ణ !

చెన్నై/ తిరునల్వేలి: ఒకే కాలేజ్ లో చదువుతున్న అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకున్నారు. కాలేజ్ లో అమ్మాయి కంటే అబ్బాయి సీనియర్. చాలాకాలం ఇద్దరూ కలిసి పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు. కరోనా వైరస్ లాక్ డౌన్ పుణ్యమా అంటూ కాలేజ్ మూసి వేయడంతో ఎవరి ఇళ్లలో వాళ్లు ఉండిపోయారు. ప్రియురాలు మాట్లాడకపోవడం, ఫోన్ చేసినా పట్టించుకోకపోవడంతో ప్రియుడు అసహనంతో రగిలిపోయాడు. నీ గర్ల్ ఫ్రెండ్ కు మరో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ప్రియుడికి సమాచారం అందింది. తాడోపేడో తెల్చుకోవాలని వెళ్లిన ప్రియుడు బాలక్రిష్ణన్ తన ప్రియురాలికి మరో ప్రియుడు ఉన్నాడని తెలిసింది. కాలేజ్ మెయిన్ గేట్ లోనే ప్రియురాలి గొంతు చీల్చిన ప్రియుడు బాలక్రిష్ణన్ నీకు మరో లవర్ కావాలా అంటూ రెచ్చిపోయాడు.

 డిగ్రీ పూర్తి చేసిన బాలక్రిష్ణన్

డిగ్రీ పూర్తి చేసిన బాలక్రిష్ణన్

తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా(నెలై)లోని శివంతిపట్టి ప్రాంతంలో బాలక్రిష్ణన్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. తిరునల్వేలి పట్టణంలోని పలయం కోటై ప్రాంతంలోని ఓ ప్రముఖ కాలేజ్ లో డిగ్రీ చదివి పూర్తి చేశాడు. అదే కాలేజ్ లో చదివే సమయంలో అదే కాలేజ్ లో చదువుతున్న తిరునల్వేలి పట్టణంలో నివాసం ఉంటున్న రాధా (పేరు మార్చడం జరగింది) అనే అమ్మాయితో బాలక్రిష్ణన్ ప్రేమలో పడ్డాడు.

కాలేజ్ లో ప్రేమికులు

కాలేజ్ లో ప్రేమికులు

బాలక్రిష్ణన్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న సమయంలోనే రాధాతో ప్రేమలో పడ్డాడు. బాలక్రిష్ణన్ అంటే రాధాకు కూడా చాలా ఇష్టం. ఇద్దరూ ఇష్టపడటంతో పెద్దలకు భయపడకుండా బాలక్రిష్ణన్, రాధా కాలేజ్ లో, బయట ప్రాంతాల్లో కలిసి తిరుగుతూ విహారయాత్రలకు వెలుతూ పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు.

 లాక్ డౌన్ దెబ్బతో ఢమాల్

లాక్ డౌన్ దెబ్బతో ఢమాల్


సంవత్సరం క్రితం వరకు బాలక్రిష్ణన్, రాధా లవ్ స్టోరీ సాఫీగా సాగిపోయింది. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా కాలేజ్ మూసి వేయడంతో రాధా ఇంటికే పరిమితం అయ్యింది. రాధాతో మాట్లాడాలని బాలక్రిష్ణన్ అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే ప్రియుడు బాలక్రిష్ణన్ తో రాధా ఒక్కసారి కూడా మాట్లాడలేదు.

 నీ గర్ల్ ఫ్రెండ్ కు మరో బాయ్ ఫ్రెండ్

నీ గర్ల్ ఫ్రెండ్ కు మరో బాయ్ ఫ్రెండ్


రాధాకు ఫోన్ చేసి మాట్లాడాలని బాలక్రిష్ణన్ అనేక ప్రయత్నాలు చేశాడు. బాలక్రిష్ణన్ ఫోన్ చేసినా రాధా మాత్రం ఫోన్ రిసీవ్ చెయ్యలేదు. అప్పుడే బాలక్రిష్ణన్ కు ఓ పిడుగులాంటి వార్త తెలిసింది. నీ ప్రియురాలు రాధా మరో యువకుడితో కలిసి తిరుగుతోందని, నీ గర్ల్ ఫ్రెండ్ కు మరో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసిన స్నేహితుడు సమాచారం ఇచ్చాడు.

నా లవర్ కు ఇంకో లవర్ ఉన్నాడా ?

నా లవర్ కు ఇంకో లవర్ ఉన్నాడా ?

రాధా విషయం ఏదో ఒకటి తేల్చుకోవాలని ఆమె ఇంటి దగ్గరకు ఇటీవల బాలక్రిష్ణన్ వెళ్లాడు. విషయం తెలుసుకున్న రాధా కుటుంబ సభ్యులు బాలక్రిష్ణన్ కు వార్నింగ్ ఇచ్చి పంపించేశారు. మరోసారి రాధా ఇంటి దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నించిన బాలక్రిష్ణన్ ను అతని స్నేహితులు అడ్డుకున్నారు.

 కాలేజ్ లో మరో ప్రియుడు

కాలేజ్ లో మరో ప్రియుడు

ఈసారి బాలక్రిష్ణన్ నేరుగా ప్రియురాలు రాధా ఇంటి దగ్గరకు వెళ్లిపోయాడు. రాధా కాలేజ్ కు వెళ్లిందని తెలుసుకున్న బాలక్రిష్ణన్ కాలేజ్ దగ్గరకు వెళ్లాడు. కాలేజ్ దగ్గర ఉన్న సెక్యూరిటీ సిబ్బంది పాత స్టూడెంట్ కదా అంటూ అతన్ని లోపలికి పంపించారు. కాలేజ్ లో రాధా మరో యువకుడితో చనువుగా ఉన్న విషయం గుర్తించాడు.

బాలక్రిష్ణన్ కు కాలిపోయింది

బాలక్రిష్ణన్ కు కాలిపోయింది


నీతో మాట్లాడాలని బాలక్రిష్ణన్ ప్రియురాలు రాధాకు చెప్పాడు. పక్కన కొత్త ఫ్రెండ్ ఉండటంతో రాధా బాలక్రిష్ణన్ తో మాట్లాడటానికి నిరాకరించింది. అంతే బాలక్రిష్ణన్ కు ఎక్కడో కాలిపోయి జోబులో ఉన్న పదునైన బ్లేడ్ తీసుకుని రాధా మెడ, గొంతు చెక్కేశాడు. గొంతు తెగిపోవడంతో రాధా కుప్పకూలిపోయింది.

 రాధా నన్ను మోసం చేసింది

రాధా నన్ను మోసం చేసింది

పారిపోవడానికి ప్రయత్నించిన బాలక్రిష్ణన్ ను సాటి విద్యార్థులు, కాలేజ్ సెక్యూరిటీ గార్డులు, స్థానికులు పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. కాలేజ్ లో ఉన్న వాళ్లు షాక్ అయ్యి రాధాను తిరునల్వేలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాధా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు అంటున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి రాధా నన్ను మోసం చేసిందని, అందుకే ఇలా చేశానని బాలక్రిష్ణన్ అంటున్నాడని, కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+