వాష్ రూమ్‌లో సీక్రెట్‌గా: లోపలికెళ్లిన యువతి.. అది చూసి షాక్?
శుక్రవారం వాష్ రూమ్‌కు వెళ్లిన ఓ అమ్మాయి.. అక్కడ మొబైల్ ఫోన్ రికార్డింగ్ మోడ్‌లో ఉండటం చూసి షాక్ తిన్నది.
ముంబై: స్మార్ట్ ఫోన్ల వినియోగం ఏ స్థాయిలో పెరిగిందో.. మహిళలను నిఘా నేత్రాలు వెంటాడటం అదే స్థాయిలో పెరిగింది. బెడ్ రూమ్, బాత్రూమ్, కాలేజీ.. ఇలా ప్రదేశంతో సంబంధం లేకుండా మహిళలను సీక్రెట్ కెమెరాలు వెంటాడుతూనే ఉన్నాయి.
తాజాగా ముంబైలోని సబర్బన్ విఖ్రోలీలో ఉన్న ఓ మహిళా కళాశాల వాష్ రూమ్ లో కెమెరా పెట్టి ఉంచడం వెలుగుచూసింది. కాలేజీలో పనిచేస్తున్న అటెండర్ విజయ్ శివథారే(29) ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు గుర్తించారు.
మొబైల్ ఫోన్ ద్వారా మహిళల నగ్న చిత్రాలను బంధించడానికి.. దాన్ని రికార్డింగ్ మోడ్ లో పెట్టి వాష్ రూమ్ లో ఉంచినట్లు శివథారే అంగీకరించాడు.

తెల్లవారుజామునే తాను మొబైల్ ఫోన్ ను వాష్ రూమ్‌లో ఉంచానని తెలిపాడు. శుక్రవారం వాష్ రూమ్‌కు వెళ్లిన ఓ అమ్మాయి.. అక్కడ మొబైల్ ఫోన్ రికార్డింగ్ మోడ్‌లో ఉండటం చూసి షాక్ తిన్నది. వెంటనే కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో.. వారు పోలీసులకు సమాచారం అందించారు. వాష్ రూమ్ లో ఉన్న సెల్ ఫోన్ కాలేజీ అటెండర్ దేనని గుర్తించారు.
ఆపై అటెండర్ కూడా అంగీకరించడంతో.. ఐపీసీ సెక్షన్ 354-సి కింద కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు. నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష పడవచ్చునని అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications