విందులో తాగి: సైనికాధికారి భార్యతో అసభ్యంగా కల్నల్
న్యూఢిల్లీ: సైన్యం అధికారి ఒకరు.. తన కింద అధికారి భార్యతో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన పైన సైన్యం విచారణకు ఆదేశాలు జారీ చేసింది. రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్ పదాతిదళ యూనిట్‌కు నేతృత్వం వహిస్తున్న ఓ కల్నల్ ఓ విందు కార్యక్రమంలో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు బాధితురాలు తెలిపారు.
ఇందుకు సంబంధించి ఆమె లిఖిత పూర్వకంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి భర్త కూడా ఫిర్యాదు చేశారు. కాగా, అతను అసభ్యంగా ప్రవర్తించిన సమయంలో తాగి ఉన్నాడని చెబుతున్నారు. రక్షణ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ ఎస్డీ గోస్వామి ఈ ఆరోపణలను నిర్ధారించారు.

కాగా, బ్రిగేడియల్ స్థాయి సైనికాధికారి ఒకరు తన సహాయకుడి పైన అసహజ లైంగిక చర్యకు పాల్పడ్డారన్న ఆరోపణలను ఎదుర్కొన్న విషయం ఇంతకుముందు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆయన పైన క్రమశిక్షణ చర్యలు చేపట్టే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం ఆయనను సెలవు పైన వెళ్లాల్సిందిగా పై అధికారులు ఆదేశించారు. కీలకమైన కాశ్మీర్‌లోని వాస్తవాధీనరేఖ వద్ద విధులు నిర్వహించే అధికారి సాటి పురుషుడి పైన ఇలాంటి అసహజమైన శృంగారానికి పాల్పడటాన్ని అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.












Click it and Unblock the Notifications