మోడలింగ్: లెఫ్టినెంట్ కల్నల్ కూతురిపై కల్నల్ రేప్, బోజనం పెట్టీ మరీ ఇలా..
కామంతో కళ్లు మూసుకుపోయిన ఆర్మీ కల్నల్ దారుణానికి తెగబడిన ఘటన సిమ్లాలో వెలుగుచూసింది.
Recommended Video

సిమ్లా: కామంతో కళ్లు మూసుకుపోయిన ఆర్మీ కల్నల్ దారుణానికి తెగబడిన ఘటన సిమ్లాలో వెలుగుచూసింది. షిమ్లాలోని ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ కు చెందిన 56 ఏళ్ల కల్నల్ కామంతో కళ్లు మూసుకుపోయి తోటి లెఫ్టినెంట్ కల్నల్ కూతురు (21)పైనే అత్యాచారం చేశాడు. ఈ ఘటనకు కల్నల్‌కు అతని స్నేహితుడు కూడ సహకరించారని బాధితురాలు ఆరోపిస్తోంది. అయితే అతడిని ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకొలేదు.
ఆర్మీలో లైంగిక వేధిపుల ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా చోటుచేసుకొంటున్నాయి. ఈ తరహ ఘటనలను ఆర్మీ సీరియస్‌గా తీసుకొంటుంది. ఇటీవల కాలంలోనే ఇదే తరహ ఘటన ఒకటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.
తోటి ఉద్యోగి భార్యపై అత్యాచారానికి పాల్పడిన ఉన్నత ఉద్యోగిని ఆర్మీ పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన మరువకముందే తన కిందిస్థాయి ఉద్యోగి కూతురిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది.

లెఫ్టినెంట్ కల్నల్ కూతురిపై కల్నల్ రేప్
షిమ్లాలోని ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ కు చెందిన 56 ఏళ్ల కల్నల్ తోటి లెఫ్టినెంట్ కల్నల్ కూతురు (21)పైనే అత్యాచారం చేశాడు. ఆమెను నమ్మించి తన క్వార్టర్‌కు రప్పించుకొని మరీ అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత యువతి చెబుతోంది.బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

రేప్‌కు ముందు రోజు ఇంటికి పిలిచి భోజనం
కల్నల్ తన తోటి లెఫ్టినెంట్ కల్నల్ కూతురిపై కన్నేశాడు. రేప్ చేసిన రోజుకు ముందు రోజున తండ్రితో పాటు కూతురిని కూడ ఆయన తన ఇంట్లో భోజనానికి ఆహ్వనించాడు. వారికి భోజనం పెట్టాడు. బాధిత యువతి మోడలింగ్ రంగంలో రాణించాలంటే ఏం చేయాలనే విషయమై చర్చించారు. తనకు తెలిసిన మిత్రుల సహయం చేస్తానని నమ్మించాడు.

వాట్సాప్‌లో ఫోటోలు పంపిన తర్వాత
విందు భోజనం పెట్టిన మరునాడు బాధితురాలి తండ్రికి కల్నల్ ఫోన్ చేసి ఆయన కూతురు ఫోటోలను పంపాలని ఆదేశించారు. దీంతో ఆమె కల్నల్‌కు తన ఫోటోలను వాట్సాప్‌లో పంపింది. అయితే ఈ ఫోటోలు చూసిన తర్వాత ఆయన బాధితురాలని తన వద్దకు పిలిపించాడు. ఆమె తన ఇంటికి రాగానే బలవంతంగా ఆమెను రూమ్‌లోకి తీసుకెళ్ళి మద్యం తాగించి రేప్ చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కల్నల్‌కు ఆయన స్నేహితుడు కూడ సహకరించారని ఆమె ఫిర్యాదు చేసింది.

నా తండ్రి ఉద్యోగాన్ని బెదిరింపు
నా తండ్రి ఉద్యోగాన్ని నాశనం చేస్తానని కల్నల్ బెదిరించారని బాధితురాలు ఆరోపించింది. రేప్ గురించి బయటకు ఎవరికైనా చెబితే నా తండ్రి ఉద్యోగాన్ని తీసివేస్తానని ఆయన బెదిరించారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేర పోలీసులు ఆమెను వైద్యపరీక్ష చేయించగా అత్యాచారం జరిగిందని తేలింది. దీంతో రేప్ కేసులో నిందితుడైన ఆర్మీ కల్నల్ ను అరెస్టు చేశామని షిమ్లా ఎస్పీ సంబంధవాన్ చెప్పారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications