Commercial LPG cylinder prices:కేంద్రం వాత పెట్టిందిగా: పోలింగ్ ముగిసిన మరుసటి రోజే..!!

దేశవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్ల ధరలు భారీగా పెరిగాయి. నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ తెల్లవారు జామున బుక్ చేసుకునే తొలి సిలిండర్‌‌కు కొత్త రేట్లను వర్తింపజేస్తూ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేసే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.

అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుసటి రోజే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ అయిదు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు గురువారం నాడే ముగిశాయి. ఆ మరుసటి రోజే ఎల్పీజీ సిలిండర్ల రేట్లను పెంచింది కేంద్రం.

Commercial LPG cylinder prices were increase from December 1

తాజా పెంపు వాణిజ్య అవసరాల కోసం వినియోగించే ఎల్పీజీ సిలిండర్లకు వర్తిస్తుంది. 19 కేజీల ఒక్కో సిలిండర్ మీద 21 రూపాయలు పెరిగింది. నేటి నుంచి బుక్ చేసుకునే ప్రతి కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్‌పైనా 21 రూపాయలను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది వినియోగదారుడికి. గృహావసర సిలిండర్ల రేట్లల్లో ప్రస్తుతానికి ఎలాంటి మార్పూ చేయలేదు.

ఈ పెరుగుదల తరువాత ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 1,796.50 పైసలకు పెరిగింది. ముంబైలో ఈ ధర 1,749 రూపాయలు. చెన్నైలో రూ.1,968.50 పైసలు పలుకుతోంది. కోల్‌కతాలో ఒక్కో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్‌కు వినియోగదారులు 1,908 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది.

ఇదివరకు నవంబర్ 16వ తేదీన వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరను కేంద్రం 57 రూపాయల మేర తగ్గించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఊరట కల్పించినప్పటికీ.. 15 రోజుల వ్యవధిలోనే మళ్లీ రేట్లను పెంచడం వాత పెట్టినట్టయింది. తాజా పెంపు వల్ల హోటల్, చిరు వ్యాపారులు, తోపుడుబండ్ల వ్యాపారులు ఇబ్బందులకు గురి అవుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+