తగ్గిన వంటగ్యాస్ సిలిండర్ ధరలు - నేటి నుంచి అమలు..!!
గ్యాస్ ధరలను తగ్గిస్తూ ఆయిల్ కంపెనీలు ప్రకటన చేసాయి. ప్రతీ నెలా 1వ తేదీన వంట గ్యాస్ సిలింధర్ ధరల్లో మార్పులను చమురు సంస్థలు ప్రకటిస్తాయి. ఈ రోజు నుంచి జూన్ 1వ తేదీ నుంచి మార్పులు చేసిన ధరలను వెల్లడించాయి. ఈ రోజు నుంచి వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై రూ.83.5 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. గతం కంటే ఈ సారి తగ్గింపు మరింత పెరిగింది. ఇదే సమయంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
ఎల్పీజీ ధరల్లో మార్పులు:
అంతర్జాతీయ మార్కెట్ కు అనుగుణంగా ప్రతీ నెలా ఎల్పీజీ ధరల్లో మార్పులు చేస్తూ ఆయిల్ కంపెనీలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. గత కొద్ది నెలలుగా వాణిజ్య అవసరాలకు వినిగియోగించే సిలిండర్ల ధరల విషయంలో చమురు కంపెనీలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం మార్పులు జరగటం లేదు. ప్రతీ నెలా సమీక్షలో భాగంగా ఈ రోజు నుంచి ప్రారంభమైన జూన్ మాసంలో వాణిజ్య సిలిండర్ ధర తగ్గిస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై రూ.83.5 మేర తగ్గించాయి. ఈ నిర్ణయం ద్వారా కేవలం వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్ల ధరల్లో మాత్రమే మార్పు ఉంటుంది.

కొత్త ధరలు ఇలా:
గత నెలలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.1856.50 ఉండేది. ఈ సమయంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1103 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో 1960.50 ఉండగా, తగ్గింపు తర్వాత రూ.1875.50కి చేరింది. ముంబైలో రూ.1808.5 నుంచి రూ.1725కి తగ్గింది. అలాగే చెన్నైలో 2021.50 నుంచి రూ.1937కు చేరింది. గత నెలలో అంటే మే 1న ఇదే సిలిండర్ ధరపై రూ.172 తగ్గింది. ఇదే సమయంలో తాజాగా బంగారం..వెండి ధరలు మరోసారి పెరిగాయి. ఈ రోజు ఉదయం బులియన్ మార్కెట్ లో నమోదైన ధరల ప్రకారం 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,850 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.60,930 గా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.400, 24 క్యారెట్లపై 440 మేర ధర పెరిగింది. కాగా, కిలో వెండి ధర రూ.4200 మేర పెరిగి రూ.76,800 లుగా కొనసాగుతోంది.
పెరిగిన బంగారం ధర:
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,930 గా కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930 గా నమోదైంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930 లుగా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.72,800 లుగా కొనసాగుతోంది. ముంబైలో కిలో వెండి ధర రూ.76,800, చెన్నైలో కిలో వెండి ధర రూ.76,800, బెంగళూరులో రూ.72,000 గా నిర్ణయించారు. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,800, విజయవాడలో రూ.76,800, విశాఖపట్నంలో రూ.76,800 గా కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications