ఫేస్‌బుక్ నకిలీ కోటిశ్వరుడు అరెస్టు: అమ్మాయికి బ్లాక్‌మెయిల్

బెంగళూరు: అతను మామూలు ఉద్యోగి. ఫేస్‌బుక్‌లో మాత్రం కోటీశ్వరుడు. అమ్మాయిలను పరిచయం చేసుకుని చివరికి బ్లాక్ మెయిల్ చేసి కటకటాలపాలైనాడు. బెంగళూరు నగరంలోని శివాజీనగరలోని మెడికల్ షాప్‌లో సేల్స్‌మెన్‌గా ఉద్యోగం చేస్తున్న అఫ్రోజ్ బాష (24) అనే యువకుడిని అరెస్టు చేసి జైలుకు పంపించామని కమర్షియల్ స్ట్రీట్ పోలీసులు తెలిపారు.

అఫ్రోజ్‌కు ఫేస్‌బుక్ అకౌంట్ ఉంది. ఇతనికి కంప్యూటర్ పరిజ్ఞానం బాగా ఉంది. బెంగళూరులోని ప్రసిద్ది చెందిన కాలేజ్‌లో శ్రీమంతుల కుటుంబానికి చెందిన అమ్మాయి (17) ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నది. ఈమెతో అఫ్రోజ్ ఫేస్‌బుక్‌లో పరిచయం పెంచుకున్నాడు. తన తండ్రి పెద్ద వ్యాపారవేత్త, రూ. కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని నమ్మించాడు. తాను వ్యాపారంలో బిజీబిజీగా ఉంటానని మాయమాటలు చెప్పాడు.

చాలాకాలం వీరిద్దరు ఫేస్‌బుక్‌లో టచ్‌లో ఉన్నారు. ఆ తర్వాత ఒకరి మొబైల్ నెంబర్ ఒకరు తీసుకుని మాట్లాడుకున్నారు. ఒకసారి ఇద్దరు షాపింగ్ మాల్‌లో కలిసిశారు. ఒకరికి ఒకరు నచ్చడంతో ప్రేమలో పడ్డారు.

Commercial Street police arrest face book cheater

తాను కోటిశ్వరుడు అని అమ్మాయికి చెప్పిన అఫ్రోజ్ ఎలాగైనా ఆమెనే పెళ్లి చేసుకుని శ్రీమంతుడు అయిపోవాలని భావించాడు. స్నేహితుల దగ్గర రూ. లక్షలు అప్పు చేశాడు. ప్రియురాలకి ఖరీదైన ప్లాటినమ్ బ్రాస్ లైట్ తీసిచ్చాడు.ఎప్పుడు కలిసినా ఖరీదైన బహుమతులు అందించాడు. అప్పులు ఇచ్చిన వారు అఫ్రోజ్ వెంటపడ్డారు. వెంటనే తీసుకున్న నగదు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేశాడు.

అఫ్రోజ్‌కు ఏం చెయ్యాలో పాలుపోలేదు. ప్రియురాలికి మాయమాటలు చెప్పి ఆమె దగ్గర రూ.ఐదు లక్షల విలువైన 140 గ్రాముల బంగారు నగలు తీసుకొని కుదవ పెట్టి అప్పులు తీర్చడం మొదలు పెట్టాడు. అయినా అతని అప్పులుతగ్గలేదు. ఇక తాను బంగారు నగలు ఇవ్వలేనని యువతి తేల్చి చెప్పింది.

అంతకు ముందు ఇద్దరు కలిసి మొబైల్‌లో సెల్ఫీ ఫోటోలు, వీడియో క్లిప్పింగ్స్ తీసుకున్నారు. బంగారు నగలు, నగదు తీసుకు వచ్చి ఇవ్వకపోతే మనిద్దరం తీసుకున్న ఫోటోలు ఫేస్‌బుక్‌లో, క్లిప్పింగ్‌లు యూ ట్యూబ్ లో పెడతానని బ్లాక్ మెయిల్ చేసి, ఆమె దగ్గర బంగారు నగలు తీసుకున్నాడు.

నిత్యం బ్లాక్ మెయిల్ చేసి విసిగించడంతో విరక్తి చెందిన యువతి కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. యువతి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో కమర్షియల్ స్ట్రీట్ పోలీసులు నకిలీ కోటిశ్వరుడు అఫ్రోజ్‌ను అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+