వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటిలోకి పిలిచి అత్యాచార యత్నం: డిఎస్పీ అరెస్ట్

|
Google Oneindia TeluguNews

గుర్గావ్/కోజికోడ్: కోజికోడ్: మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు శాఖలో ఉన్నతాధికారిగా కొనసాగుతున్న ఓ వ్యక్తి మహిళపై లైంగిక వేధింపులకు ప్రయత్నించి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని కెనిచిపురా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తన నివాసంలోనే మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన డిఎస్పీ ఏజె జార్జ్‌ను కెనిచిపురా పోలీసులు అరెస్ట్ చేశారు.

అతనిపై ఐపిసి 354 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. కోలేరిలో నివాసముంటున్న బాధిత మహిళ సోమవారం ఉదయం 5 గంటలకు డిఎస్పీ ఇంటి ముందు నుంచి వెళుతుండగా ఆమెను ఆపి, బలవంతంగా ఇంటిలోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు డిఎస్పీని అరెస్ట్ చేశారు.

 Company director, employees booked for 'raping' lady colleague

వేధింపులు: ఉద్యోగి ఫిర్యాదుతో డైరెక్టర్‌పై కేసు

గుర్గావ్: తాను పని చేస్తున్న కంపెనీ డైరెక్టర్, మరి కొందరు ఉద్యోగులు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆ కంపెనీలో పని చేస్తున్న ఓ మహిళా ఉద్యోగిని గుర్గావ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆన్ హెవిట్ అనే కంపెనీ డైరెక్టర్, మరి కొందురు ఉద్యోగులపై ఐపిసి 376, 354, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

నోయిడాలోని ఆన్ హెవిట్ కార్యాలయంలో తాను విధులు నిర్వహిస్తున్నానని, తనను తరచూ తన క్యాబిన్‌కు పిలిపించుకుని వేధింపులకు పాల్పడే వాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కాగా కొత్త చట్టం ప్రకారం ఈ చర్యలను అత్యాచారం కింద పరిగణించవచ్చని పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అయితే బాధితురాలు తాను ఎప్పుడు (తేది) వేధింపులకు గురైందో తెలపలేదని ఆయన చెప్పారు.

బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, అయితే ఇప్పటి వరకు ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదని ఆయన చెప్పారు. కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇది ఇలా ఉండగా ఆ మహిళ ఉద్యోగినిని తమ కంపెనీని నుంచి గత నెలలోనే తొలగించామని ఆ కంపెనీ స్పష్టం చేసింది.

English summary
After receiving a zero FIR from their counterpart in Delhi, Gurgaon Police lodged an FIR against the director of a company and his colleagues for allegedly raping a 32-year-old employee, a source said today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X