మోడీతో పోల్చడం కాంప్లిమెంటే: షారూక్, కొత్తగా అని..
ఇండోర్: తనను ప్రధాని నరేంద్ర మోడీతో పోల్చడం అభినందనగా భావిస్తానని ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ అన్నారు. తమ ఇద్దరివి భిన్నమైన ప్రొఫెషనల్స్ కావడం వల్ల మోడీతో పోల్చడం కొంచెం కొత్తగా ఉందని షారూక్ ఖాన్ చెప్పారు.
షారూక్ ఖాన్ తన తాజా చిత్రం ‘హ్యాపీ న్యూ ఇయర్' ప్రచారం కోసం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ వచ్చారు. అక్కడ ‘రాజకీయాల్లో మోడీ ఎలాగో.. చిత్ర పరిశ్రమలో షారూక్ అలాగన్న' ఓ మీడియా ప్రతినిధికి బదులిస్తూ షారూక్ పై వ్యాఖ్యలు చేశారు.

‘ఆయన (మోడీ) దేశాధినేత. ఆయన మనదేశాన్ని ముందుకు తీసుకెళ్తారని మనం నమ్ముతున్నాం. అలాగే తాను దేశాన్ని ఎంటర్టెయిన్ చేస్తానని ప్రజలు నమ్ముతున్నారు' అని షారూక్ తెలిపారు. మోడీతో పోల్చడాన్ని తాను అభినందనగానే భావిస్తానని షారూక్ చెప్పారు.
‘ఆయన (మోడీ) పెద్ద నాయకుడు. ఆయనను ప్రజలు ఎంతో అభిమానిస్తారు. ఆరాధిస్తారు' అని షారూక్ ఖాన్ అన్నారు.












Click it and Unblock the Notifications