విద్యార్థులా? బజారు రౌడీలా? క్లాస్ రూమ్ లోనే ఇంత ఘోరమా! (వీడియో)
కొచ్చి : చదువుకునే పిల్లల్లో ఇంతటి కౄరత్వమా! బజారు రౌడీలను తలపించేలా క్లాస్ రూమ్ లోనే ఇంతటి అమానుషమా! ఒక్కడిని టార్గెట్ చేసుకుని ఐదారుగురు విద్యార్థులు తోటి విద్యార్థిని అత్యంత దారుణంగా చితకబాదిన సంఘటన ఇది.
జరిగిందో ఏ స్కూల్లో..! ఎక్కడా..! లాంటి వివరాలు తెలియరానప్పటికీ.. విద్యార్థులు ధరించిన యూనిఫాంను బట్టి చూస్తే మాత్రం.. అదో కేంద్రీయ విద్యాలయం అన్న వాదనలు వినిపిస్తున్నాయి.
కేరళకు చెందిన ఓ ఐఏఎస్ అధికారి తన ఫేస్ బుక్ పేజీలో ఈ వీడియోను పోస్ట్ చేయడంతో.. ఇది కాస్త వైరల్ గా మారింది. సదరు విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ వీడియో చేరేవరకు ఫేస్ బుక్, వాట్సాప్ లలో ఫార్వార్డ్ చేయాలంటూ వీడియో విపరీతంగా షేర్ అవుతోంది. కాగా, తోటి విద్యార్థి పట్ల ఇంత రాక్షసంగా వ్యవహరించిన సదరు విద్యార్థులపై నెటిజెన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
ఏదేమైనా స్కూల్ కు వెళ్లే వయసులోనే ఇలా.. వీధి రౌడీల కన్నా హీనంగా ప్రవర్తించం పట్ల పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. వీడియో ఆధారంగా దాడి చేసిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications