వర్సిటీలో లేడీస్ బాత్రూంలో సీక్రెట్ వీడియో రికార్డింగ్
మంగళూరు: మంగళూరు విశ్వవిద్యాలయంలోని లేడీస్ టాయిలెట్ గదిలో రహస్య కెమెరాను గుర్తించారు. ఈ సంఘటన గత నెలలో జరిగింది. దీనిపై గురువారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళల వాష్ రూం సీలింగ్ పైన కెమెరా ఆన్ చేసి ఉన్న సెల్ ఫోన్‌ను గుర్తించారు.
గత నెల ఆగస్టు 24వ తేదీన సెల్ ఫోన్ ఈ సంఘటన వెలుగు చూసింది. యూనివర్సిటీలో విద్యార్థినులు కాలకృత్యాలు తీర్చుకునే వాష్ రూంలో కెమెరా ఉండటం షాకింగ్‌కు గురి చేసింది. కాలకృత్యాలు తీర్చుకునేందుకు టాయ్‌లెట్ రూంకు వెళ్లిన ఓ యువతి అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి షాకైంది.

వాష్ రూం రూఫ్‌కు రంధ్రం ఉండటాన్ని గమనించింది. యాజమాన్యానికి ఈ సంగతి తెలిపింది. చైర్మన్ వచ్చి పరిశీలించారు. ఆ హోల్‌లో ఓ సెల్‌ఫోన్ దొరికింది. దీంతో యాజమాన్యం, అక్కడున్న విద్యార్థినులు అవాక్కయ్యారు. ఆ ఫోన్‌లో సిమ్ కార్డ్ లేదు.
కానీ ఆ సెల్‌ఫోన్‌లో విద్యార్థినుల అసభ్యకర దృశ్యాలు రికార్డయ్యాయి. అందులో చాలామంది యువతులు వాష్ రూంలో కాలకృత్యాలు తీర్చుకుంటుండగా గుర్తుతెలియని సన్నివేశాలను చిత్రీకరించారు. ఇందులో ఇరవై నిమిషాల వీడియో రికార్డైంది. యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సెల్‌ఫోన్‌ను సీజ్ చేశారు.












Click it and Unblock the Notifications