దిక్కుమాలిన బిగ్ బాస్ షోని ఆపేయండి, డీజీపీ, మీడియాకు ఫిర్యాదులు, ఫ్యామిలీతో చూడాలా ? వద్దా ?
కలర్స్ కన్నడ టీవీ ఛానెల్‌లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షోపై ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. రియాల్టీ షోపై చర్యలు తీసుకోవాలని బిగ్ బాస్ షో వీక్షకులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు బిగ్ బాస్ కన్నడ షో నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని శివమొగ్గ జిల్లాలోని సాగర్ పట్టణానికి చెందిన న్యాయవాది కేవీ ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
కర్ణాటక రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ), మీడియా కంట్రోల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఇమెయిల్ ద్వారా, పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేసిన న్యాయవాది కేవీ ప్రవీణ్ బిగ్ బాస్ నిర్వహకుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని మనవి చేశారు.

ఈ కార్యక్రమం దాని నైతిక ప్రమాణాలను కోల్పోయిందని, కంటెస్టెంట్ల మధ్య అసభ్యపదజాలం, చెంపదెబ్బలు, బెదిరింపుల దృశ్యాలు ప్రసారమవుతున్నాయని, ఇది కుటుంబాల మీద, సమాజంపై చెడు ప్రభావం చూపుతుందని న్యాయవాది ప్రవీణ్ ఫిర్యాదులో ఆరోపించారు.
మరోవైపు బిగ్ బాస్ కన్నడ షో నిర్వహకుల తీరుపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొంతమంది కంటెస్టెంట్లు దారుణమైన ప్రవర్తనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ట్విట్టర్(X)లో చాలా మంది బెంగళూరు పోలీసులను ట్యాగ్ చేసి బిగ్ బాస్ కన్నడ మీద ఫిర్యాదులు చేశారు.
టాస్క్‌లో ప్రతాప్, సంగీత కళ్లు దెబ్బతిన్నాయి. ఈ ప్రవర్తనపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దీనికి తోడు బిగ్ బాస్ కంటెస్టెంట్ వినయ్ గౌడ నేరుగా ఇతర కంటెస్టెంట్లను బెదిరిస్తున్నాడని ఆరోపించారు.

బిగ్ బాస్ కన్నడ షోపై తాము చేస్తున్న ఫిర్యాదులను సెక్షన్ 506 కింద కేసు నమోదు చేయాలని, సుమోటోగా కేసు స్వీకరించి విచారణ చెయ్యాలని చాలా మంది సోషల్ మీడియాలో డీజేపీని, బెంగళూరు సిటీ పోలీసులను అభ్యర్థిస్తున్నారు. కొందరు కంటెస్టెంట్ల నుంచి హింస కూడా చోటుచేసుకుందని నెటిజన్లు మండిపడ్డారు. ప్రోగ్రామ్ యొక్క అసలు ఉద్దేశాన్ని కొందరు కంటెస్టెంట్లు నాశనం చేస్తున్నారని, కొందరు కంటెస్టెంట్లు వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలని ఏమాత్రం ప్రయత్నించడం లేదని ఆరోపించారు.
బిగ్ బాస్ కన్నడ షో విపరీతమైన వైఖరితో కొనసాగుతోందని, ప్రాణహాని సహా పలు రకాలుగా దాడికి యత్నిస్తున్నారని, దయచేసి వాటిని క్షుణ్ణంగా గమనించండి అని బెంగళూరు పోలీసులను ట్యాగ్ చేసి పోస్ట్ చేశారు. సుదీప్ సర్ ఈ బ్యాడ్ బిగ్ బాస్ షో నుండి మీరు బయటకి రండి. మీ వ్యక్తిత్వం మీద ఈ దిక్కుమాలిన షో ప్రభావితమవుతుందోని, ప్రజలు ఇలాంటి షోలను చూడకూడదని, మీరు ఇలాంటి షోలు నిర్వహించకూడదని కిచ్చా సుదీప్ కు ఆయన అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.
కిచ్చా సుదీప్ ఆయన వ్యక్తిత్వం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని ఆయన అభిమానులు మనవి చేస్తున్నారు. నేను మీకు మళ్లీ చెబుతున్నాను దయచేసి ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఈ బిగ్ బాస్ చూడకండి. మునుపటి సీజన్‌లు అద్భుతంగా ఉన్నాయి, ఈ సీజన్ లో చాలా మంది మానసిక స్థితిని నాశనం చేస్తోంది. బిగ్ బాస్ స్టేజ్ అనేది చాలా మంది కల. కానీ ఇది విపరీతమైన వైఖరి అని మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications