Jio: దేశవ్యాప్తంగా జియో నెట్ వర్క్ డౌన్..!
జియో టెలికామ్ రంగంలో భారీ మార్పును తెచ్చిన సంగతి తెలిసిందే. తొలుత ఉచితంగా సేవలు అందించిన సంస్థ తర్వాత ఛార్జీలు వసూలు చేసింది. జియో తక్కువ సమయంలోనే అత్యధిక మంది యూజర్లను సాధించింది. ప్రస్తుతం జియో 5జీ సర్వీసులు కూడా అందిస్తోంది. అయితే వినియోగదారులు భారీగా పెరిగిపోవడంతో వారికి తగ్గట్లు సేవలు అందించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. చాలా చోట్ల జియో సిగ్నల్ రావడం లేదని వినియోగదారులు చెబుతున్నారు.
సిగ్నల్ వచ్చినా నెట్ రావడం లేదని సోషల్ మీడియాలో ఫిర్యాదు చేస్తున్నారు. చాలా చోట్ల 5జీ రావడం లేదని జియో కస్టమర్ కేర్ ఫోన్లు వస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా మంగళవారం కూడా జియో యూజర్లు తీవ్రమైన అసౌకర్యానికి గురైనట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 17న జియో నెట్ వర్క్ తగ్గిపోయినట్లు తెలుస్తోంది. ముంబైలో జియో వినియోగదారులు సిగ్నల్ రాక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో జియో వాడుతున్న వార అసహనంతో ఎక్స్ లో పోస్ట్ చేస్తున్నారు.

మధ్యాహ్నం 12.36కి 10,367 జియో యూజర్లు నెట్వర్క్ ఎర్రర్ సమస్యను ఎదుర్కొన్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఉదయం 10.13 నిమిషాలకు ఏడుగురు, 11.13 నిమిషాలకు 653 మంది జియో వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. 68 శాతం మందికి నో సిగ్నల్, 18 శాతం మందికి మొబైల్ ఇంటర్నెట్ సమస్య ఎదురైనట్లు పేర్కొంటున్నారు. అలాగే 14 మంది బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులు కూడా సమస్యలు ఎదుర్కొన్నట్లు వివరించారు.
మిగిలిన నెట్ వర్కులైన ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ లు బాగానే పని చేశాయి. జియో వినియోగదారులకు తగ్గట్లుగా టవర్లను ఏర్పాటు చేయలేదని విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్ లో కూడా పలువురు వినియోగదారులు 5జీ నెట్ రాక ఇబ్బంది పడుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కొన్ని ఊళ్లలో జియో సిగ్నల్ రావట్లేదని చెబుతున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications