వచ్చేస్తోంది.. రూ.200 నోటు! విడుదలకు ఆర్బీఐ సన్నాహాలు!

చ‌రిత్ర‌లోనే తొలిసారిగా రూ.200 నోటును ప్ర‌వేశ‌పెట్ట‌డానికి సిద్ధ‌మ‌వుతోంది రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ). ఈనెల చివ‌ర్లో లేదా సెప్టెంబ‌ర్ మొద‌టి వారంలోనే ఈ కొత్త రూ.200 నోటు బ‌య‌ట‌కు రానుంది.

ముంబై: చ‌రిత్ర‌లోనే తొలిసారిగా రూ.200 నోటును ప్ర‌వేశ‌పెట్ట‌డానికి సిద్ధ‌మ‌వుతోంది రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ). వీలైతే ఈ నెల చివ‌ర్లో లేదా సెప్టెంబ‌ర్ మొద‌టి వారంలోనే ఈ కొత్త రూ.200 నోటు బ‌య‌ట‌కు రానుంది.

సుమారు 50 కోట్ల రూ.200 నోట్ల‌ను ఆర్బీఐ మార్కెట్‌లోకి తీసుకురానుంది. మార్కెట్‌లో ఈ నోట్ట‌కు కొర‌త లేకుండా, బ్లాక్ మార్కెట్‌కు త‌ర‌ల‌కుండా అన్ని చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇప్ప‌టివ‌ర‌కు భార‌తదేశ చరిత్ర‌లో రూ.100 నుంచి రూ.500 మధ్య ఎలాంటి నోటు లేదు.

rs-200-note

అందుకే రూ.200 నోటు మార్కెట్‌లో బాగా పాపుల‌ర్ అవుతుంద‌ని ఆర్బీఐ భావిస్తోంది. అందుకు త‌గిన‌ట్లే వాటి కొర‌త లేకుండా చూసుకుంటోంది అని ఆర్బీఐ అధికారి ఒక‌రు వెల్ల‌డించారు.

భారీగా మార్కెట్‌లోకి రానున్న ఈ కొత్త రూ.200 నోటు వ‌ల్ల ఇప్ప‌టివ‌ర‌కు ఇబ్బందులు ప‌డుతున్న సామాన్య జ‌నం క‌ష్టాలు తీరుతాయ‌ని ఎస్‌బీఐ చీఫ్ ఎక‌న‌మిస్ట్ కాంతి ఘోష్ అభిప్రాయ‌ప‌డ్డారు.

హ‌డావిడిగా ప్ర‌వేశ‌పెట్టిన రూ.2000 నోట్లు బ్లాక్ మార్కెటింగ్ త‌ర‌లిపోవ‌డం, న‌కిలీలు రావ‌డంతో ఈ కొత్త రూ.200 నోటు అలాంటి వాటి బారిన ప‌డ‌కుండా అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

పెద్ద నోట్లు మార్కెట్‌లో ఎక్కువ‌గా లేక‌పోతే.. ప‌న్నులు ఎగ్గొట్టి అక్ర‌మంగా దాచుకునే సొమ్ము కూడా త‌క్కువ‌వుతుంద‌ని ఆర్బీఐ భావిస్తున్న‌ది. ఈ రూ.200 నోట్ల వ‌ల్ల త‌క్కువ విలువ ఉన్న నోట్ల కొర‌త తీర‌నుంది.

నోట్ల ర‌ద్దు త‌ర్వాత మార్కెట్లో పెద్ద నోట్ల చెలామ‌ణి 86 శాతం నుంచి 70 శాతానికి ప‌డిపోయింది. ఈ రూ.200 నోటు వ‌స్తే వాటి వాడ‌కం మ‌రింత త‌క్కువ‌వుతుంద‌ని ఆర్థిక నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+