లైంగిక వేదింపులు...... విదేశీ టెక్కికి దేహశుద్ది
బెంగళూరు: మహిళతో అసభ్యంగా ప్రవర్థించిన విదేశీయుడికి స్థానికులు దేహశుద్ది చేసిన సంఘటన బెంగళూరు నగరంలో జరిగింది. కాంగో దేశానికి చెందిన లేగ్రాండ్ మండే (29) అనే యువకుడికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.
లెగ్రాండే మండే రెండు సంవత్సరాల క్రితం బెంగళూరు చేరుకుని మహదేవపుర సమీపంలోని ఎఇసీఎస్ లేఔట్ లో భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. కుందలహళ్ళిలోని ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ఇతను టెక్కిగా ఉద్యోగం చేస్తున్నాడు. ఇతని ఇంటి సమీపంలో బట్టలు ఐరన్ చేసే దుకాణం ఉంది. ఈ దుకాణంలో లెగ్రాండ్ దుస్తులు ఐరన్ చేయించుకునేవాడు.
ఈ విదంగా బట్టల ఐరన్ షాప్ యజమాని, అతని భార్య లెగ్రాండేకి పరిచయం ఉన్నారు. ఈ నెల 9వ తేదిన లెగ్రాండే బట్టలు తీసుకుని ఐరన్ షాప్ దగ్గరకు వెళ్లాడు. ఆ సమయంలో మహిళ ఒక్కరే అక్కడ ఉన్నారు. తరువాత బట్టలతో పాటు రూ. 500 మహిళ దగ్గరకు ఇచ్చాడు.

తన ఇంటి లోకి వచ్చి లైంగిక కొరిక తీర్చాలని ఇంకా ఎక్కువ డబ్బు ఇస్తాను అంటు ఆమెతో అసభ్యంగా ప్రవర్థించాడు. ఆ సందర్బంలో మహిళ గట్టిగా కేకలు వేసింది. లెగ్రాండే అక్కడి నుండి పరారైనాడు. తరువాత అతని కొసం స్థానికులు గాలించినా ఫలితం లేకపోయింది.
ఆదివారం సాయంత్రం లెగ్రాండే ఐరన్ షాప్ దగ్గర వెలుతున్న విషయం మహిళ గుర్తించింది. వెంటనే భర్త, స్థానికులకు విషయం చెప్పింది. అప్పటికే విషయం పసిగట్టిన లెగ్రాండే పారిపోవడానికి ప్రయత్నించాడు. స్థానికులు కలిసి వెంటాడి లెగ్రాండేని పట్టుకున్నారు.
తరువాత చేతికి చిక్కిన కర్రలు, వికెట్లు తీసుకుని అతనిని చితకబాది మహదేవపుర పోలీసులకు అప్పగించారు. పోలీసులు లెగ్రాండే మీద లైంగిక వేదింపుల కేసు నమోదు చేసి అతని పాస్ పోర్టు స్వాదీనం చేసుకున్నారు. అయితే తన భర్త మీద అనవసరంగా దాడి చేశారని, అతను ఎలాంటి తప్పు చెయ్యలేదని ఆరోపిస్తు లెగ్రాండే భార్య స్థానికుల మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications