మోడీని అభినందిస్తున్నా, ఎంతో ధైర్యం: నోట్ల రద్దుపై ముఖేష్ అంబానీ

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: రూ.500, రూ.1000 నోట్ల రద్దు ప్రకటన పైన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ గురువారం నాడు స్పందించారు. నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి తాను శుభాకాంక్షలు చెబుతున్నానని వ్యాఖ్యానించారు.

వారు 9వేల కోట్ల ఫోన్ కాల్స్ బ్లాక్ చేస్తున్నారు, మార్చి 31 వరకు ఉచితం: జియోపై అంబానీ

'నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న ప్రధాని మోడీని అభినందిస్తున్నా. ఎంతో ధైర్యంతో ప్రధాని మోడీ నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు. దేశంలో పారదర్శకత పెంచేందుకు నోట్ల రద్దు నిర్ణయం ఉపయోగపడుతుంది. ఆర్థిక దిశను మార్చే దిశగా ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది. డిజిటల్ ఎకానమీ దేశాన్ని మరింత వృద్ధిలోకి తెస్తుంది. నోట్ల రద్దు సాధారణ పౌరులకు కూడా ఉపయోగపడుతుంద'ని అంబానీ అన్నారు.

ఇక ముందు ప్రయాణ టిక్కెట్లు సహా ఇతర సేవల కోసం క్యూలో నిలబడి ఉండాల్సిన అవసరం ఉండదని చెప్పారు. డిజిటల్‌ ఎకానమీతో దేశం మరింత ముందుకు వెళ్తుందన్నారు. ఇది పారదర్శకతకు ఉపయోగపడుతుందన్నారు.

Congratulate PM Modi on demonetisation decision, says Mukesh Ambani.

కాగా, పోటీతత్వాన్ని తట్టుకోలేక ఇతర టెలికాం కంపెనీలు కుట్రలకు పాల్పడుతున్నాయని ముఖేష్ అంబానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని మూడు అతి పెద్ద టెలికాం కంపెనీలు గత మూడు నెలల్లో దాదపు కోట్ల వాయిస్ కాల్స్‌ను బ్లాక్ చేశాయన్నారు.

అత్యున్నతమైన జియో టెక్నాలజీ కస్టమర్లకు చేరకుండా అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. గతంలో 90 శాతంగా ఉన్న డ్రాప్ కాల్స్‌ను ప్రస్తుతం 20 శాతానికి తగ్గించేశామన్నారు. తమ వినియోగదారులకు దేశవాళీ వాయిస్ కాల్స్‌ను ఉచితంగా అందించేందుకు జియో కట్టుబడి ఉందన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congratulate PM Modi on demonetisation decision, says Mukesh Ambani.
Please Wait while comments are loading...