అత్తమీద కోపం దుత్త మీద అన్నట్లు కాంగ్రెస్ నిర్ణయం.. నెల రోజుల పాటు మీడియా చర్చలకు దూరం..

ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి కాంగ్రెస్ కోలుకోలేకపోతుంది. ఫలితాల అనంతరం పరిణామాలతో సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. నెల రోజుల పాటు టీవీ డిబేట్లలో పాల్గొనవద్దని నిర్ణయించింది.

మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయం

మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయం

ఎన్నికల్లో ఓటమి, తదనంతర ఫలితాలతో ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్న కాంగ్రెస్ వైఫల్యానికి కారణాలు అన్వేషించే పనిలో పడింది. ఈ నేపథ్యంలో కొంతకాలం పాటు మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. పార్టీ అధికార ప్రతినిధులెవరూ మీడియా ఛానళ్లు నిర్వహించే చర్చా కార్యక్రమాలకు వెళ్లొద్దని కాంగ్రెస్ మీడియా ఇంఛార్జ్ రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా ప్రకటించారు. అలాగే మీడియా కూడా అందుకు సహకరించి, చర్చలకు తమ పార్టీ వారిని ఆహ్వానించవద్దని విజ్ఞప్తి చేస్తూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

ఊహాగానాలకు తావులేకుండా

ఊహాగానాలకు తావులేకుండా

రాహుల్ గాంధీ రాజీనామాపై అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో పార్టీ నిర్ణయం వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై మీడియాలో అనేక ఊహాజనిత కథనాలు వెలువడుతుండటంతో పార్టీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దీనిపై నేతలు నోరు జారితే అనవసర చిక్కులు తలెత్తే అవకాశముందని గ్రహించిన పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

పార్టీలో నైరాశ్యానికి నిదర్శనం

పార్టీలో నైరాశ్యానికి నిదర్శనం

రణ్‌దీప్ ప్రకటన గ్రాండ్ ఓల్డ్ పార్టీలో నెలకొన్న నైరాశ్యానికి నిదర్శనమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం ఆ పార్టీని కోలుకోలేదని దెబ్బ తీసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికల వైఫల్యం నుంచి బయటపడేందుకు కొంత సమయం తీసుకోవాలని భావిస్తున్నందునే కాంగ్రెస్ మీడియాతో దూరం పాటించాలని కోరుకుంటోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తగ్గుతున్న కాంగ్రెస్ ప్రభ

తగ్గుతున్న కాంగ్రెస్ ప్రభ

కాంగ్రెస్ పార్టీ 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తుడిచి పెట్టుకుపోయింది. గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఘన విజయం సాధించినా.. లోక్‌సభ ఎన్నికలు వచ్చేనాటికి పరిస్థితి మారిపోయింది. మరోవైపు 2004 నుంచి వరుసగా విజయం సాధిస్తున్న యూపీలోని అమేథీలో రాహుల్ ఘోర పరాజయం పాలవడం ఆయనను కుంగదీసింది. ఒకవేళ కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేయకపోతే ఆయన ఈసారి లోక్‌సభలో అడుగుపెట్టే అవకాశమే లేకుండా పోయేది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+