ఆర్ఆర్ నగర్ లో నాయుడు విజయం: అదే కారణం, లక్ష ఓట్లు, సిద్దూ ప్రభుత్వం, కులం, మతం!

బెంగళూరు: కర్ణాటకలో తీవ్రస్థాయిలో చర్చకు కారణం అయిన బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరి నగర్ (ఆర్ఆర్ నగర్) శాసన సభ నియోజక వర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నిర్మాత, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మునిరత్న నాయుడు మరోసారి 25,402 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గతంలోని సిద్దూ ప్రభుత్వం, కులం, మతం నాయుడు విజయంలో సాయం చేశాయని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.

లక్ష ఓట్లు

లక్ష ఓట్లు

ఆర్ఆర్ నగర్ శాసన సభ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన మునిరత్న నాయుడుకు 1,08,064 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి మునిరాజు గౌడకు 82,572 ఓట్లు, జేడీఎస్ పార్టీ అభ్యర్థి జీహెచ్. రామచంద్రప్పకు 60,360 ఓట్లు వచ్చాయి.

సిద్దరామయ్య ప్రభుత్వం

సిద్దరామయ్య ప్రభుత్వం

బెంగళూరులోని ఆర్ఆర్ నగర్ లో మునిరత్న విజయం సాధించలేదని, గతంలో కర్ణాటకలో అధికారంలో ఉన్న సిద్దరామయ్య ప్రభుత్వం అభివృద్ది పనులు విజయం సాధించాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు ట్వీట్ చేశారు.

జేడీఎస్-కాంగ్రెస్ సవాల్

జేడీఎస్-కాంగ్రెస్ సవాల్

కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత జరిగిన శాసన నభ ఎన్నికలపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. అందరి కళ్లు ఆర్ఆర్ నగర్ మీద పడ్డాయి. సంకీర్ణ ప్రభుత్వం ఉన్నా ఆర్ఆర్ నగర్ లో కాంగ్రెస్, జేడీఎస్ లు వేర్వేరుగా ఒకరి మీద ఒకరు పోటీ చేశాయి.

పార్టీలకు నాయుడు అతీతం

పార్టీలకు నాయుడు అతీతం

ఆర్ఆర్ నగర్ నియోజక వర్గంలో గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన మునిరత్న నాయుడు కుల మతాలు, పార్టీలకు అతీతంగా అన్ని ప్రాంతాల్లో అభివృద్ది చెయ్యడం వలనే ఇంత భారీ మెజారిటీతో విజయం సాధించారని డీకే. శివకుమార్, డీకే. సురేష్ సోదరులు సంతోషం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+