రాహుల్ కలర్ ఏమిటి: పోలీసులు ఆరా, బీజేపీదీ గూఢచర్యమని ఫైర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాసానికి పోలీసులు వెళ్లి అక్కడి సిబ్బందిని కొన్ని వివరాలు అడగడంపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఇది గూఢచర్యమని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుండగా.. సాధారణ విధులను గూఢచర్యమని చెప్పడం విడ్డూరమని బీజేపీ అంటోంది. ప్రముఖులు ఉండేచోట గస్తీ సిబ్బంది ఇలాంటి సమాచారాన్ని సేకరించడం సాధారణమైన విషయమని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
ఈ నెల 12వ తేదీన కొందరు పోలీసులు తుగ్లక్ లేన్లో ఉన్న రాహుల్ నివాసానికి వెళ్లారు. రాహుల్ గురించి ఆరా తీశారు. ఆయన ఎలా ఉంటారు? ఆయన కళ్ల రంగు ఏమిటి? జుట్టు ఎలా ఉంటుంది? ఎలాంటి కళ్ల జోడు ధరిస్తారు? ఏం చేస్తుంటారు? ఎక్కడకు వెళ్తుంటారు? వంటి ప్రశ్నలు సంధించారని తెలుస్తోంది.
రాహుల్ నివాసానికి పోలీసులు వెళ్లడంపై ప్రధాని మోడీ, హోంమంత్రి వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సింఘ్వీ శనివారం డిమాండ్ చేశారు. బీజేపీ రాజకీయ గూఢచర్యానికి పాల్పడుతోందని సింఘ్వీ విమర్శించారు. ఇది గుజరాత్ మోడల్ కావచ్చని, కానీ, భారత్ మోడల్ కాదన్నారు. గుజరాత్‌లో రాజకీయ ప్రత్యర్థులు, జడ్జీలు, జర్నలిస్టులు, ఇతర ప్రయివేటు వ్యక్తుల జీవితాల్లోకి రహస్యంగా తొంగిచూసిన సంఘటనలు ఉన్నాయన్నారు.
ప్రముఖుల నివాసానికి...

పోలీసులు ఆనను లక్ష్యంగా చేసుకోలేదని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ చెప్పారు. ఇది సాధారణ ప్రక్రియే అన్నారు. కీలకమైన వ్యక్తుల సమాచారాన్ని ఎప్పటికి అప్పుడు తెలుసుకునే ప్రయత్నమే ఇది అన్నారు. రాహుల్ నివాసానికి తమ సిబ్బంది వెళ్లిన రోజే మాజీ మంత్రి వీరప్ప మొయిలీ, బీజేపీ అగ్రనేత అద్వానీ, తెలంగాణ సీఎం కేసీఆర్ తదితరుల నివాసానికి వెళ్లారని చెప్పారు. రాహుల్ గురించి ఆరా తీయాలని తమకు ప్రభుత్వం నుండి ఒత్తిళ్లు లేవన్నారు.
రాహుల్ సెలవులో ఉన్నారని, పార్టీ కార్యక్రమాలకు, రాజకీయాలకు కొంతకాలంపాటు దూరంగా ఉంటారని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గత నెల 23న ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన షంషేర్ సింగ్ అనే అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ 12న తుగ్లక్ రోడ్డులోని రాహుల్ నివాసానికి వెళ్లి అతడి వ్యక్తిగత వివరాలు తెలుసుకోసాగారని కాంగ్రెస్ నేతలు చెప్పడం గమనార్హం.
రాహుల్ వయసు ఎంత? ఎంత ఎత్తు ఉంటారు? ఏ రంగులో ఉంటారు? రాహుల్ సన్నిహితులు ఎవరు? వారి చిరునామాలు, ఫోన్ నెంబర్లు ఏంటి?... తదితర వివరాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు సిబ్బంది షంషేర్‌ను అడ్డుకున్నారు.












Click it and Unblock the Notifications