సోనియా గాంధీ సంచలన నిర్ణయం - కాంగ్రెస్ పదవుల నుంచి ఆజాద్, ఖర్గే సహా కీలక నేతలు తొలగింపు

జాతీయ కాంగ్రెస్ పార్టీలో కనీవినీ ఎరుగని పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అదిష్టానం తీరును సవాలు చేస్తూ ఘాటు లేఖ రాసిన గులాం నబీ ఆజాద్ సహా పలువురు కీలక సీనియర్ నేతలను పదవుల నుంచి తప్పించారు. పార్టీ ప్రక్షాళనలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. అయితే, జనరల్ సెక్రటరీలుగా తొలగించిన నేతలను మరో కీలక కమిటీల్లోకి తీసుకోవడం గమనార్హం.

ఇన్నాళ్లూ కాంగ్రస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా కొనసాగిన గులాం నబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, మోతీలాల్ వోరా, లుజిన్హో ఫలేరియో, అంబికా సోనిలను పదవుల నుంచి తప్పిస్తూ శుక్రవారం రాత్రి ఆదేశాలు వెలువడ్డాయి. కాగా, ఆజాద్, అంబికా సోనిలు వర్కింగ్ కమిటీలో సభ్యులుగా మాత్రం కొనసాగుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.

 Congress drops Azad, , Kharge, Soni and other key leaders as general secretaries

కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎన్నికతోపాటు సంస్థాగతంగా ప్రక్షాళన అవసరమంటూ 23 మంది సీనియర్లు సోనియా గాంధీకి రాసిన లేఖపై పెద్ద దుమారం చెలరేగడం తెలిసిందే. ఆరు నెలల్లోగా కొత్త చీఫ్, ప్రక్షాళన ప్రక్రియ చేపడతామమని ఏఐసీసీ అధికార ప్రతినిధులు గతంలోనే ప్రకటించారు. ఆ ప్రక్రియలో భాగంగానే అధినేత్రి సోనియా ఇవాళ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+