రాహుల్‌కి 'లో ఐక్యూ', కాంగ్రెస్ నేత బహిష్కరణ

ఈ విషయాన్ని పరిశీలించిన హైకమాండ్ అతడిని పార్టీ నుంచి బహిష్కరించింది. ఈ విషయంపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మానెక్ అగర్వాల్ మాట్లాడుతూ ఏఐసీసీ సభ్యుడు అయ్యాక పార్టీ నుంచి బహిష్కరించాలని పార్టీ అధిష్ఠానమే నిర్ణయించిందని తెలిపారు.
అంతకుముందు పార్టీ అధికారాన్ని ప్రశ్నించిన అతనిపై మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని, అందుకే ఏఐసీసీ అతనిని పార్టీ నుంచి బహిష్కరించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
గుఫ్రాన్ ఏ అజమ్ గత జులైలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఓ లేఖ రాశారు. రాహుల్ గాంధీలో నాయకత్వ లక్షణాలు కొరవడ్డాయని, ఆయనకు పెద్దగా తెలివితేటలు (లో ఐక్యూ) లేవని లేఖలో విమర్శించారు. ఆ లేఖ రాయడం వల్లనే తాజా బహిష్కరణకు కారణం.
అంబికా సోనీ ఆలిండియా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు గుఫ్రాన్ ఏ అజమ్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మోతీలాలా వోరా రాజ్యసభ సీటు ఖాళీ అవడంతో ఆ స్దానంలో నాలుగేళ్లపాటు రాజ్యసభ సభ్యుడిగా గుఫ్రాన్ ఏ అజమ్ కొనసాగారు. బీటల్ పార్లమెంట్ స్దానం నుంచి ఒకసారి లోక్ సభ్ సభ్యుడిగా ఎన్నికయ్యారు.












Click it and Unblock the Notifications