మధ్యప్రదేశ్ ఎన్నికల్లో రామాయణ్‌ నటుడిని బరిలో దింపిన‌ కాంగ్రెస్..

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధ‌మ‌వుతుంది. అయితే ఈసారి జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కాంగ్రెస్ త‌ర‌పున రామ‌య‌ణ్ న‌టుడిని బ‌రిలోకి దింపారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌స్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై పోటీగా కాంగ్రెస్ పార్టీ, ప్రముఖ నటుడు విక్రమ్ మస్తాల్‌ను రంగంలోకి దింపింది. దీంతో ఇక్క‌డి అసెంబ్లీ ఎన్నిక‌లు కాస్త ర‌స‌వ‌త్త‌రంగా మార‌నున్నాయి.

హ‌నుమంతుడి పాత్ర‌లో విక్ర‌మ్‌: 2008లో వచ్చిన రామాయణ్‌లో హనుమంతుడి పాత్ర‌లో విక్రమ్ మస్తాల్‌ నటించారు. ఈ పాత్రకు గానూ ఆయనకు విశేష గుర్తింపు ల‌భించింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ బుద్ని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎన్నికల బరిలో నిలుస్తుండగా.. అదే స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా విక్రమ్ పోటీ చేయ‌నున్నారు.

actor Vikram Mastal to contest against the current Chief Minister

సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బుద్ని స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు బీజేపీ ఎప్ప‌డో ప్ర‌క‌టించేసింది. బుద్ని అసెంబ్లీ స్థానం శివరాజ్ చౌహాన్‌కు కంచుకోట లాంటిద‌నే చెప్పుకోవాలి. ఎందుకంటే, ఇక్క‌డ‌ 2018 అసెంబ్లీ ఎన్నికలలో చౌహాన్ 58,999 ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు.

144 మందితో కూడిన కాంగ్రెస్ జాబితా: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు 144 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ ఆదివారం విడుదల చేసింది. ఇందులో నటుడు విక్రమ్‌కు చోటు ల‌భించింది. న‌టుడు విక్రమ్ ఈ ఏడాది జూలైలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ జాబితాలోని ఇత‌ర పేర్లు ఇలా ఉన్నాయి... చింద్వారా అసెంబ్లీ నియోజకవర్గం నుండి మాజీ ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ కమల్ నాథ్‌ బరిలో దిగ‌నున్నారు. మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ తనయుడు జైవర్ధన్ సింగ్ రఘీగథ్ స్థానం నుంచి పోటీచేయ‌నున్నారు.

 Congress fielded Ramayan actor in Madhya Pradesh election..

ఈ జాబితాలో జనరల్ కేటగిరీ నుంచి 47 మందికి సీట్లు ఇవ్వ‌గా, ఓబీసీ కేటగిరీ నుంచి 39 మందికి, అలాగే ఎస్టీ కేటగిరీ నుంచి 30 మంది, ఎస్సీ కేటగిరీ నుంచి 22 మంది, ముస్లిలంకు ఒక సీటు ఇవ్వ‌గా, 19 మంది మహిళలకు ఈ జాబితాలో స్థానం ద‌క్కింది. ఈ జాబితాలో ఉనన్న అభ్యర్థుల్లో ఎక్కువ శాతం 65 మంది 50 ఏళ్లలోపు వారే ఉండ‌డం విశేషం. ఇక‌, మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్థానాలకుగాను నవంబర్ 17న ఒకే దశలో పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. వీటి ఫ‌లితాల‌ను డిసెంబర్ 3న వెల్ల‌డిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+