48,20,69,00,00,000 రూపాయల అవినీతి: లెక్క తేల్చిన కేంద్రం

న్యూఢిల్లీ: దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదాని సారథ్యంలోని అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు లక్షల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక వెల్లడించిన తరువాత కాంగ్రెస్.. కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీపై దాడికి దిగుతోంది. దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయాలంటూ డిమాండ్ చేస్తోంది. ఈ విషయంలో పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేసింది. అదాని అంశంపై నిగ్గు తేల్చాలంటూ ప్రశ్నించినందుకే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసిందనేది కాంగ్రెస్ వాదన.

ఈ పరిస్థితుల మధ్య బీజేపీ- ఎదురుదాడికి దిగింది. కాంగ్రెస్‌పై అవినీతి ఆరోపణలను సంధిస్తోంది. ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది బీజేపీ. తన హయాంలో కాంగ్రెస్ లక్షల కోట్ల రూపాయల మేర అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తోంది. 48,20,69,00,00,000 రూపాయల మేర అవినీతి చోటు చేసుకుందంటూ లెక్క తేల్చింది. దీనికి సంబంధించిన వివరాలతో కూడిన ఓ వీడియో క్లిప్‌ను రూపొందించింది. దీనికి కాంగ్రెస్ ఫైల్స్ (Congress Files)గా పేరు పెట్టింది. ఎపిసోడ్ల వారీగా ఈ వీడియోలను విడుదల చేయనుంది.

Congress Files: BJP released the 1st episode as its attack over corruption allegations

ఇందులో తొలి ఎపిసోడ్‌ను ఇవ్వాళ విడుదల చేసింది. 70 సంవత్సరాల పాలనలో ప్రజల నుంచి 48,20,69,00,00,000 రూపాయలను కాంగ్రెస్ లూటీ చేసిందని బీజేపీ ఆరోపించింది. ఈ మొత్తాన్ని దేశ రక్షణ, భద్రత, అభివృద్ధికి ఉపయోగించి ఉండొచ్చని అభిప్రాయపడింది. అలాకాకుండా తన స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ నాయకులు ఇన్ని లక్షల కోట్ల రూపాయలను ప్రజల నుంచి దోచుకున్నారంటూ ఘాటు విమర్శలు సంధించింది.

ఈ మొత్తంతో 24 ఐఎన్‌ఎస్ విక్రాంత్, 300 రాఫెల్ జెట్‌ ఫైటర్స్, 1000 మంగళ్ మిషన్‌లను తయారు చేసి ఉండొచ్చని బీజేపీ వివరించింది. కాంగ్రెస్ అవినీతి వల్ల దేశం భారీగా నష్టపోయిందని, అందుకే ఇన్ని దశాబ్దాలుగా అభివృద్ధి చెందలేదని ఆరోపించింది. బొగ్గు కుంభకోణం- రూ.1.86 లక్షల కోట్లు, 2జీ స్పెక్ట్రమ్- రూ.1.76 లక్షల కోట్లు, జాతీయ ఉపాధి హామీ పథకం- రూ.10 లక్షల కోట్లు, కామన్వెల్త్ గేమ్స్- రూ.70 వేల కోట్లు, ఇటలీతో హెలికాప్టర్ డీల్- రూ.362 కోట్లుగా తేలిందని వివరించింది. ఇది ఇక్కడితో ఆగిపోలేదని ఇంకా లెక్క తేలుస్తామని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+