బీజేపీ-యోగి ఎఫెక్ట్: చెక్ చెప్పేందుకు కాంగ్రెస్ 'హిందుత్వ'
2014 సార్వత్రిక ఎన్నికల నుంచి నిన్నటి అయిదు రాష్ట్రాల ఎన్నికల వరకు.. ఢిల్లీ, బీహార్ వంటి ఒకటి రెండు మినహా బీజేపీ దూసుకెళ్తోంది. ఇప్పుడు బీజేపీ దృష్టి గుజరాత్‌పై పడింది.
అహ్మదాబాద్: 2014 సార్వత్రిక ఎన్నికల నుంచి నిన్నటి అయిదు రాష్ట్రాల ఎన్నికల వరకు.. ఢిల్లీ, బీహార్ వంటి ఒకటి రెండు మినహా బీజేపీ దూసుకెళ్తోంది. ఇప్పుడు బీజేపీ దృష్టి గుజరాత్‌పై పడింది.
గుజరాత్‌లో బీజేపీకి ఇప్పటి వరకు తిరుగు లేదు. అయితే, పటేళ్ల ఉద్యమం వంటి అంశాలు ఇటీవల తెరపైకి వచ్చాయి. ఇది బీజేపీకి ఇబ్బందిని తీసుకు వచ్చే అంశమే. గుజరాత్‌లో ఈసారి 150 సీట్లు గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.

స్టార్ కంపెయినర్లు
ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వంటి వారు స్టార్ కంపెయినర్‌లుగా ఉంటున్నారు. బీజేపీకి హిందుత్వ ముద్ర ఉంది.

హిందుత్వ అజెండా
గతంలో మైనార్టీలు మూకుమ్మడిగా ఓ పార్టీకి ఓటు వేసేవారు. హిందువులు కూడా తమకు అన్యాయం జరుగుతోందని భావిస్తున్నారు. దీంతో వారు కూడా కొంతలో కొంత మూకుమ్మడి ఓటుకు మరలుతున్నట్లుగా కనిపిస్తోంది. యూపీ సహా ఇటీవల జరిగిన పలు ఎన్నికలు అందుకు నిదర్శనం అంటున్నారు.

బీజేపీకి కౌంటర్‌గా కాంగ్రెస్
ఈ నేపథ్యంలో బీజేపీకి ధీటుగా కాంగ్రెస్ పార్టీ కూడా గుజరాత్ ఎన్నికల్లో హిందుత్వ అజెండాను తెరపైకి తీసుకు రానుందని అంటున్నారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ముందస్తు ఎన్నికల అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు.

కాంగ్రెస్ ఇలా.. బీజేపీ అలా
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. గుజరాత్ ఎన్నికల్లో హిందుత్వ అంశంతో ముందుకు వెళ్లాలని నేతలకు ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలు సూచించినట్లుగా తెలుస్తోంది. బీజేపీకి హిందుత్వ ముద్ర ఉంది. దాంతో పాటు అభివృద్ధి అంశాలతో ఎన్నికలకు వెళ్ళనుంది.
-
BJP అధికారంలోకి వస్తే 'చేపల' నిషేధం! దీదీకి స్ట్రాంగ్ కౌంటర్ -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
న్యాయం చేయలేకపోయా - కవిత ఆవేదన -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు!












Click it and Unblock the Notifications