UP: కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. ఆ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటన..!

ఇటీవల హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇబ్బందికర ఫలితాలే వచ్చాయి. జమ్మూ కాశ్మీర్ హస్తం కూటమి అధికారంలోకి వచ్చింది. కానీ హర్యానాలో మాత్రం కాంగ్రెస్ గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ అధికారంలోకి వస్తాయని చెప్పాయి. కానీ ఫలితాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. కారణం అక్కడ పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఆప్ పార్టీ చీల్చడంతో హస్తం పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకోలేక పోయింది. దీంతో బీజేపీ అధికారంలోకి వచ్చింది.

ఇండియా కూటమిలో ఉన్న ఆప్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా పోటీ చేసింది. దీనికి కారణం హర్యానా కాంగ్రెస్ నేతలే అని చెబుతున్నారు. ఓవర్ కాన్పిడెన్స్ తమ పార్టీ గెలుస్తుందని ఆప్ తో పొత్తు వద్దనుకున్నారు. దీంతో హర్యానాలో అధికారంలోకి రాలేకపోయారు. హర్యానా నుంచి కాంగ్రెస్ పాఠం నేర్చుకుంది. అందుకే యూపీలో జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకుంది. ఇండియా కూటమిలో ఉన్న సమాజ్ వాదీ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఓ నిర్ణయానికి వచ్చింది.

Congress has decided not to contest the by-elections for 9 seats in UP

బై పోల్ ఎస్పీకి మద్దతు ఇస్తున్నట్లు యూపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ అవినాష్ పాండే ప్రకటించారు. యూపీలోని కతేహరి, కర్హల్, మీరాపూర్, ఘజియాబాద్, మజ్హవాన్, సిసమావు, ఖైర్, ఫుల్పూర్, కుందర్కి స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. మొదటగా ఇందులో ఐదు స్థానాలకు కాంగ్రెస్ పోటీ చేయాలని భావించింది. కానీ చివరి నిమిషంలో వెనక్కి తగ్గింది. ఈ 9 స్థానాలకు నవంబర 13న పోలింగ్ జరగనుంది. నవంబర్23న ఫలితాలు ప్రకటించనున్నారు. సమాజ్ వాదీ పార్టీ ఇప్పటికే
7 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనుంది. లోక్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీ కలిసి పోటీ చేశాయి. యూపీలో గతం కంటే ఎక్కువ సీట్లు గెలిచాయి. ఈ నేపథ్యంలో మిత్ర ధర్మంతో ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదన నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. హర్యానా ఆప్, కాంగ్రెస్ కలిపి పోటీ చేస్తే పరిస్థితి మరోలా ఉండేదని మాట్లాడుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+