రాజ్యసభను వృద్ధాశ్రమం చేయవద్దు, కురియన్ ఇక తప్పుకోవాలి: కేరళ కాంగ్రెస్
తిరువనంతపురం: రాజ్యసభను వృద్ధాశ్రమంగా మార్చవద్దని, యువకులకు అవకాశాలు ఇవ్వాలని కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ ఇకనైనా రాజకీయాల నుంచి సెలవు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
కాగా, జూన్ నెలలో కేరళలో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో కురియన్ రీ-నామినేషన్ అంశం చర్చనీయాంశమైంది. 'ఇప్పటికే 3 సార్లు రాజ్యసభకు ఎన్నికైన కురియన్ ఈసారైన తెలివైన నిర్ణయం తీసుకుని పార్లమెంటరీ రాజకీయాల నుంచి తప్పుకుంటారని భావిస్తున్నాం' అని కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీటి బలరాం తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిప్రాయపడ్డారు.

బలరాం వ్యక్తపరిచిన అభిప్రాయాన్నే పార్టీలోని మరికొందరు ఎమ్మెల్యేలు బలపరిచారు. రాజ్యసభను ఒక వృద్ధాశ్రమంగా మార్చాలని పార్టీ అనుకోవడం లేదని వారు గుర్తుచేస్తున్నారు. యువకులకు కాంగ్రెస్ పార్టీ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలను గుర్తుచేసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
కేరళ కాంగ్రెస్ చీఫ్ ని మారుస్తారా?కేరళ కాంగ్రెస్ నాయకుల అభిప్రాయంపై కురియన్ కూడా సానుకూలంగానే స్పందించారు. పార్టీ వెళ్లిపోమంటే అందుకు తాను సిద్దమని చెప్పారు.
చెంగనూర్ ఉపఎన్నికలో ఓటమితో పార్టీలో వాడి వేడి చర్చ జరుగుతోంది. ఓటమికి నేపథ్యంలో కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎంఎం హసన్ ను తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోనియా గాంధీ చికిత్స నిమిత్తం విదేశాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరిగి రాగానే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
-
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications